మారుమూల గిరిజన గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగుడెం జిల్లా దమ్మపేట మండలంలో పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన పూజలు.. భయాందోళనకు దారితీశాయి.. మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ పగలు రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతూ రాత్రి సమయంలో క్షుద్రపూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అమాయక గిరిజనుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి, అలాగే భయపెట్టడానికి నారపోగు నాగరాజు అనే మాజీ సర్పంచ్ తాంత్రిక పూజలు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. తాంత్రిక విద్యలతో గాలిలో నిమ్మకాయలు నిలబెడుతూ అమాయక గిరిజనులని మభ్యపెట్టడమే కాకుండా ఓ క్షుద్ర మంత్రికుడిని తీసుకొచ్చి పూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నం రాసులపై జంతువుల మాంసం పెట్టి రక్త తర్పణాలు చేసి క్షుద్ర శక్తులను ఆధీనంలోకి తీసుకునేందుకు మాంత్రికుడితో పూజలు చేయిస్తున్నట్టు తెలియడంతో గ్రామస్తులు మరింత భయాందోళనలో ఉన్నారు. నాగరాజు గతంలో కూడా ఫేక్ పాస్ పుస్తకాల కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చాడని.. క్రిమినల్ మెంటాలిటీ కలిగిన ఇతను డబ్బే ప్రధాన ధ్యేయంగా క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని పలువురు పేర్కొంటున్నారు.
ఈ టెక్నాలజీ యుగంలో కూడా మూఢ నమ్మకాల పేరుతో అమాయక ప్రజలను మభ్యపెట్టి క్షుద్ర పూజలు చేస్తూ గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేస్తున్న మాజీ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలో ఇటువంటి తాంత్రిక పూజలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో మూఢనమ్మకాల పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పలువురు నాయకులు, యువత కోరుతున్నారు.
Also Read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





