మణికొండ పంచవటి కాలనీలో కాల్పుల మోత మోగింది. స్థల వివాదంలో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఆ తర్వాత అనుచరులతో కలిసి స్థలాన్ని ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు ప్రభాకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం రేగింది. మణికొండ పంచవటి కాలనీలో ఓ స్థల వివాదానికి సంబంధించి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు గాల్లోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. పంచవటి కాలనీలో ఉన్న తమ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. ఖాళీ చేస్తారా..? లేదా అంటూ ప్రభాకర్ తన గన్‌తో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల శబ్దం కాలనీవాసులను ఉలిక్కిపడేలా చేసింది.
ఆ తర్వాత ప్రభాకర్ అనుచరులు బాధితులను స్థలం నుంచి బలవంతంగా బయటకు గెంటేసి.. గేటుకు తాళాలు వేశారు. ప్రభాకర్ దౌర్జన్యంగా తమ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నాడరని.. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ క్రమంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ప్రభాకర్‌పై బాధితులు ఫిర్యాదు చేశారు. తమ భూమిని లాక్కున్న ప్రభాకర్‌తో పాటు అతడి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద ప్రభాకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also Read
- Telangana: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





