SGSTV NEWS
CrimeTelangana

మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!

తన మరదలితో వివాహం జరపడం లేదని, తన మామ, మరదలు ఇద్దరు తనను మోసం చేశారనే ఆవేదనతో ఓ యువకుడు తనువు చాలించాడు. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన హనుమకొండ జిల్లాలో కలకలం రేపింది. క్రిమిసంహారక మందు తాగుతూ ఆత్మహత్యకు యత్నించాడు. ఆ యువకుడు తన సెల్ఫీ వీడియో గ్రామంలోని అన్ని వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. తన మరణంతో తన మామ, మరదలు కళ్ళు తెరిపించాలని కోరుకుంటూ ఆత్మహత్యకు యత్నించాడు.

ఈ ఘటన భీమదేవరపల్లి మండలం బోల్లోనిపల్లి గ్రామంలో జరిగింది. మోహన్ అనే యువకుడు పురుగుల మందు సేవిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తన ఆత్మహత్యకు కారణాలు సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడి చేశాడు. లొకేషన్ ఆధారంగా యువకుడిని గుర్తించిన పోలీసులు ప్రాణాపాయస్థితిలో ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

చిన్నతనం నుండి తన మామ కూతురితో వివాహం జరిపిస్తానని మాట ఇచ్చి తప్పారని అందులో ఆవేదన చెందాడు.. మరదలుపై ప్రేమ పెంచుకున్నాడు.. కానీ మోహన్ కు తన కూతురును ఇవ్వడానికి అత్తమామలు నిరాకరించడం, తన మరదలు కూడా మోసం చేసిందనే ఆవేదనతో తీవ్ర మనస్తాపం చెందిన మోహన్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. తన మరణానికి కారణం సెల్ఫీ వీడియోలో తెలియపరుస్తూ ఆ సెల్ఫీ వీడియోను గ్రామంలోని సోషల్ మీడియాలో, అదేవిధంగా తన స్నేహితులకు పోస్ట్ చేశాడు..

గ్రామస్తులు, మోహన్ స్నేహితులు సెల్ఫీ వీడియోచూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లొకేషన్ ఆధారంగా అతన్ని మంగళపల్లి శివారులోని గుట్టలో గుర్తించారు. వెంటనే అక్కడి చేరుకుని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మోహన్ ప్రాణాపాస్థితిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.

Also read

Related posts