మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వృద్దుడిని దారుణంగా హత్య చేశాడు. పోలీసులకు చిక్కకుండా అడవిలోకి పరారయ్యాడు. సీన్ కట్ చేస్తే.. గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేసి నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కానీ అలా పోలీస్ స్టేషన్ లోకి ఎంట్రీ ఇచ్చాడో లేదో సినిమా స్టైల్ లో బేడీలతో సహా పోలీసుల కళ్లుగప్పి మాయం అయ్యాడు ఓ నిందితుడు.
మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వృద్దుడిని దారుణంగా హత్య చేశాడు. పోలీసులకు చిక్కకుండా అడవిలోకి పరారయ్యాడు. సీన్ కట్ చేస్తే.. గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేసి నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కానీ అలా పోలీస్ స్టేషన్ లోకి ఎంట్రీ ఇచ్చాడో లేదో సినిమా స్టైల్ లో బేడీలతో సహా పోలీసుల కళ్లుగప్పి మాయం అయ్యాడు ఓ నిందితుడు. ఈ ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి పీఎస్ లో చోటు చేసుకుంది.
గత శనివారం (నవంబర్ 01) కొమురంభీం జిల్లా తిర్యాణీ మండలం మంగి గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టగూడకు చెందిన హన్మంతరావు (50) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన సీడాం వినోద్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. అడ్డువచ్చిన హన్మంతరావు భార్య బొజ్జబాయిపై సైతం దాడికి పాల్పడ్డాడు వినోద్. ఆమె ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంట్లోకి పరుగులు తీసింది. తీవ్రంగా గాయపడ్డ హన్మంతరావు అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న తిర్యాణి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోగా నిందితుడు వినోద్ అడవిలోకి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అడవంతా గాలించి ఎట్టకేలకు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు.
సీన్ కట్ చేస్తే బాత్రూం వెళ్తానని చెప్పిన నిందితుడు వినోద్ పోలీసుల కళ్లు కప్పి పోలీస్ స్టేషన్ నుండి పరారయ్యాడు. బేడీలతో సహా బాత్రూం గోడపై నుండి బయటకు దూకి పరారయ్యాడు. గుర్తించిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు
Also read
- దేవి నవరాత్రులు మొదలు దీపావళి వరకు- ఆశ్వయుజ మాసంలో వచ్చే పండుగలు, పుణ్య తిథులు ఇవే!
- నవరాత్రుల్లో అదృష్టం.. ఈ రాశి వారు కోరుకున్న కోరిక నెరవేరుతుంది
- Garuda Purana: అప్పు తీర్చకుండా మరణిస్తే ఏమవుతుంది? గరుడ పురాణం ఏం చెబుతోంది?
- Parivartan Yoga: పరివర్తన యోగం.. అదృష్టాలు పట్టబోయే రాశులివే..!
- మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను ఎందుకు పూజించాలి? గోత్రం తెలియకపోతే ఏం చేయాలి?





