పెళ్లైన కొన్నాళ్ళకే భర్తపై భార్య హత్యాయత్నం ఘటన కలకలం రేపుతోంది. కట్టుకున్న భర్తనే హతమార్చేందుకు భార్య తన ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి కుట్ర పన్నింది. హైదరాబాద్ నుంచి వనపర్తికి వచ్చి మరీ దాడికి పాల్పడి అడ్డంగా బుక్కయ్యారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
పెళ్లైన 45 రోజులకే ఫ్రెండ్స్‌తో కలిసి భర్తను హత్య చేసేందుకు భార్య ప్రయత్నించిన ఘటన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా కేంద్రంలోని బ్రహ్మం గారి వీధికి చెందిన షబ్బీర్ కు నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లి కి షాహిదా బేగంతో 45రోజుల క్రితం వివాహమైంది. అయితే షాహిదా హైదరాబాద్ కు చెందిన సమీప బంధువు షాకీర్ చాలా ఏళ్లుగా ప్రేమించుకున్నారు. తల్లితండ్రుల బలవంతంతో ప్రియుడిని కాదని షబ్బీర్ తో వివాహానికి అంగీకరించింది షాహిదా. ఈ క్రమంలో ప్రియుడిని మర్చిపోలేక… భర్త హత్యకు కుట్ర పన్నింది.
షాహిదా తన ప్రియుడు షాకీర్, అతని స్నేహితుడు మహేశ్వర్ లాల్‌తో కలిసి భర్త షబ్బీర్‌ను హత్య చేసేందుకు స్కెచ్ వేసింది. పథకం ప్రకారం ముగ్గురూ కలిసి షబ్బీర్‌పై దాడికి ప్రయత్నించారు. ఈ నెల 15 అర్థరాత్రి తర్వాత షబ్బీర్ ఇంట్లోకి చొరబడిన నిందితులు దాడికి దిగారు. నిద్రిస్తున్న షబ్బీర్ ముఖంపై HIT స్ప్రే చల్లారు. అనంతరం భార్య షాహేదా భర్త షబ్బీర్ చేతులను పట్టుకోగా, ఆమె ప్రియుడు షాకీర్ బెల్టుతో గొంతు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఈ దాడిలో షబ్బీర్ ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటించాడు. నిందితుల దాడిని తట్టుకుంటూ షబ్బీర్ గట్టిగా కేకలు వేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
అతడి అరుపులు విన్న సోదరుడు బయటకు వచ్చాడు. కుటుంబ సభ్యులు తలుపులు తట్టడంతో నిందితుల ప్రయత్నానికి ఆటంకం ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న షబ్బీర్ నిందితులను తోసేసి బయటకు వచ్చాడు. ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో పోలీస్ కంట్రోల్ రూమ్ ఫిర్యాదు అందింది. పెట్రోలింగ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఘటనపై విచారణ చేపట్టారు. షాహిదా, ఆమె ప్రియుడుకి సహకరించేందుకు మహేశ్వర్ లాల్ అనే వ్యక్తి ఇంటి బయట పల్సర్ బైక్‌పై వేచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భర్త హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య షాహేదా, ప్రియుడు షాకీర్, అతని స్నేహితుడు మహేశ్వర్ లాల్‌ను అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. వనపర్తిలో వెలుగుచూసిన ఈ ఘటనలో కుటుంబ సభ్యుల అప్రమత్తత, బాధితుడి ప్రతిఘటనతో తృటిలో ప్రాణాపాయం తప్పింది.
Also read
- భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య.. ఆపై పోలీసులకు కట్టుకథ.. ఏం చెప్పిందో తెలిస్తే..
- అబ్బా జర్రుంటే.. పెళ్లైన 45 రోజులకే భర్త హత్యకు స్కెచ్.. ఎలా తప్పించుకున్నాండంటే
- తెలంగాణ : కారు రేసింగ్ సరదా.. ఓ కుటుంబంలో విషాదం!
- భార్యాభర్తల గొడవలో జోక్యం.. సర్దిచెప్పబోయిన వ్యక్తి దారుణ హత్య!
- Telangana: తుపాకీ కోసం వెళ్తే ఊహించని ట్విస్ట్.. తనిఖీల్లో బయటపడ్డది చూసి అధికారులే అవాక్కు..





