రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిత్యం అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. అయితే తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అపశృతి చోటు చేసుకుంది. ఇక్కడి స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న
కరీంనగర్, నవంబర్ 10: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిత్యం అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. అయితే తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అపశృతి చోటు చేసుకుంది. ఇక్కడి స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.
వాంతులు చేసుకుంటూ, కడుపు నొప్పితో విద్యార్ధులు విలవిల్లాడారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు చికిత్స కోసం వారిని జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ రోజు మధ్యాహ్న భోజనంలో విద్యార్ధులకు ఇచ్చిన గుడ్లు వాసన వచ్చినట్లు విద్యార్ధులు తెలిపారు. ఇక అన్నంలో పురుగులు కూడా వచ్చాయని పలువురు విద్యార్థులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాగా రాష్ట్రంలో గత కొంతకాలంగా మధ్యాహ్న భోజనం పథకంపై నీలినీడలు అలముకుంటున్నాయి.
నాణ్యత లేని భోజనం విద్యార్ధులకు అందించడం వల్ల వారు తరచూ అనారోగ్యం బారీన పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఇలాంటి నిర్లక్ష్య ఘటనలతో మచ్చ తెచ్చుకుంటుంది
Also Read
- నేటి జాతకములు.14 నవంబర్, 2025
- సృజన్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి?
- కె జి హచ్ వైద్యం అందక గిరిజన పసికందు మృతి
- ఏడో తరగతి బాలుడిపై లైంగికదాడి
- భార్యపై అనుమానంతో దారుణం చేసిన భర్త





