తిరుపతి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మహిళ ఓవైపు బిడ్డకు జన్మనివ్వగా.. మరోవైపు ఆమెభర్త మృతి చెందాడు. చెంగమ్మకు పురిటినొప్పులు రావడంతో ఆమెభర్త హరికృష్ణ హాస్పిటల్ చేర్పించాడు. డెలివరీ ఖర్చులకు డబ్బులు తెచ్చేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
ఇదో హృదయ విదారక ఘటన. ఓ కుటుంబంలో ఒక ప్రాణం ఊపిరి పోసుకుంటే.. మరోప్రాణం ఊపిరి తీసుకుంది. ఈ ఘటనతో ఆ గ్రామం విలవిల్లాడిపోయింది. అయ్యో.. పాపం అంటూ గ్రామ ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎందుకు దేవుడా.. ఇలా చేశావంటూ కుటుంబ సభ్యులు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. . .
పురిటి నొప్పులు రావడంతో . .
తిరుపతి జిల్లాకు చెందిన ఒక మహిళ ఓ వైపు బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అదే సమయంలో ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలిసి ఆ మహిళ కన్నీరు మున్నీరైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లాకు చెందిన చెంగమ్మకు పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త హరికృష్ణ హుటా హుటిన ఆస్పత్రిలో చేర్పించాడు
రోడ్డు ప్రమాదంలో. .
అయితే డెలివరీ ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో వాటిని తీసుకురావడానికి బైక్‌పై ఇంటికి వెళ్లాడు. అలా వెళ్తుండగా శ్రీకాళహస్తిలోని తంగేడుపాలెం క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది. టెంపో వ్యాన్ హరికృష్ణ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. ఇక భర్త మరణ వార్త విన్న భార్య చెంగమ్మ బోరున విలపించింది. అయ్యో ఏం పాపం చేశానంటూ చెంగమ్మ కన్నీరుమున్నీరైంది. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది.
Also read
- Vastu Tips: బల్లి మీద పడినా, కలలో కనిపించినా మీ ప్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా?
- భర్త చనిపోయాక మంగళసూత్రం ఏం చేయాలి..? 99శాతం మంది చేస్తున్న తప్పు ఇదే..
- నేటి జాతకములు 18 మార్చి, 2026
- గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా చింతలపాటి వెంకటరామయ్య ఘనంగా (సి.వి.ఆర్) నామినేషన్
- రెండో తరగతి బాలికపై వృద్ధుడి అఘాయిత్యం





టీడీపీలోకి చేరిన కోడికత్తి శీను – జగన్ సీఎం కావడం కోసం ఐదేళ్లు జైళ్లో మగ్గానని ఆవేదన – Kodi Kathi Seenu Joined Tdp