ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. తమ వర్గం వారిని హత్య చేశారని.. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మిగనూరు మండలంలోని కందనాతిలో వెంకటేశ్ (40), పరమేశ్ (35)ను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. మరొక వ్యక్తి గోవింద్ ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. వీరికి.. రెండేళ్ల క్రితం హత్యకు గురైన వర్గం వారికి వర్గపోరు నడుస్తోంది. గతంలో ఊరు వదిలి వెళ్లిపోయిన వైరి వర్గంవారు తిరిగి వచ్చారు. ఎప్పట్నుంచో వారి కోసం ఎదురు చూస్తోన్న ప్రత్యర్థులు పొలంలో పరమేశ్‌ను హత్య చేశారు. వెంకటేశ్ ను గ్రామంలో చంపేశారు. గోవింద్ పొలం నుంచి వస్తుండగా వేటకోడవళ్లతో దాడి చేయగా.. తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి డీఎస్పీ భార్గవి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్‌ను విచారిస్తున్న సిట్
- అంకిత భండారి హత్య కేసు – ఆమె కుటుంబం CBI విచారణ కోరుతోంది
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!



