November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

మియాపూర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్య కేసును చేధించిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?




మియాపూర్‌లో హత్యకు గురైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ స్పందన కేసును చేధించారు పోలీసులు. గత నెల 30వ తేదీన దారుణంగా హత్యకు గురైంది ఈ టెకీ. నిందితుడ్ని పట్టుకున్నారు.



హైదరాబాద్ మియాపూర్‌లోని దీప్తి శ్రీనగర్‌లో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్పందన కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 30న స్పందన తన ఇంట్లో హత్యకు గురైంది. ముఖంపై, శరీర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని పట్టుకున్నారు. బాల్య మిత్రుడే ఆమె పాలిట కాలయముడయ్యాడని పోలీసులు నిర్దారించారు. తన ప్రేమ, పెళ్లి అంగీకరించలేదన్న అక్కసుతో ఈ దారుణానికి ఒడిగట్టాడు మందల మనోజ్ కుమార్ అలియాస్ బాలు. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దీప్తీశ్రీనగర్‌కు చెందిన స్పందన(29), వినయ్ కుమార్, గబ్చిబౌలి సుదర్శన్ నగర్‌ ఎంఓయూ కాలనీకి చెందిన  మనోజ్ కుమార్ ఇంటర్ నుండి మంచి ఫ్రెండ్స్.


ఆ సమయంలోనే మనోజ్ స్పందనను ప్రేమించాడు. ఆ విషయాన్ని ప్రియురాలికి చెప్పాడు. కానీ అతడి ప్రేమను కాదంది. మనం ఎప్పటిలా ఫ్రెండ్స్‌గా కొనసాగుదామని చెప్పింది. కానీ ఆమెపై మరింత ప్రేమ పెంచుకున్నాడు మనోజ్. ఈ క్రమంలో వినయ్ కుమార్ ప్రేమలో పడింది స్పందన. సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించి తన కాళ్ల మీద తాను నిలబడింది. తమ ప్రేమను ఇంట్లో చెప్పింది. 2022లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు ఈ లవ్ బర్డ్స్. అన్నాళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామన్న ఆనందం ఎంతకాలం నిలువలేదు వీరికి. పెళ్లైన తర్వాత ఒకరంటే ఒకరికి పడలేదు. ఇద్దరి మధ్య నిత్యం గొడవలు రావడంతో విడివిడిగా జీవిస్తున్నారు. విడాకుల కోసం అప్లయ్ చేసుకున్నారు. తన తల్లి, సోదరుడితో కలిసి దీప్తి శ్రీనగర్‌లో సీబీఆర్ఎస్టేట్‌లో ఉంటోంది.

ఈ క్రమంలో ఆమె లైఫ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు ఇంటర్మీడియట్ ఫ్రెండ్ మనోజ్ కుమార్. భర్తతో ఆమె దూరంగా ఉంటుదని తెలుసుకున్నాడు. మళ్లీ తన ప్రేమ చిగురించనుందని ఆశపడ్డాడు. స్పందనతో తరచుగా మాట్లాడటం, ప్రపోజల్స్ పెట్టేవాడు. అంతే కాకుండా నేరుగా ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడు. ఆమె అందుకు అంగీకరించలేదు. ఇదే సమయంలో కొలిగ్స్, స్నేహితులతో స్పందన సన్నిహితంగా మెలగడాన్ని ఓర్చుకోలేకపోయాడు. ఆమెపై పీకల్లోతు కోపాన్ని పెంచుకున్నాడు.  చంపేయాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 30న స్పందన ఇంటికి వెళ్లాడు. మరోసారి ప్రపోజల్ పెట్టగా.. ఆమె నిరాకరించింది.


దీంతో గ్రానెట్ రాయితో తలపై కొట్టాడు. స్కూ డ్రైవర్‌తో ఆమె మొహంపై పొడిచాడు. అనంతరం మెయిన్ డోర్ లాక్ చేసి పారిపోయాడు. టీచర్‌గా వర్క్ చేస్తున్న స్పందన తల్లి.. సాయంత్రం ఇంటికి రాగా, తాళం వేసి ఉండటాన్ని చూసి కూతురికి కాల్ చేసింది. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తాళం పగులగొట్టి వెళ్లి చూడగా.. రక్తపు మడుగుల్లో కూతురు కనిపించడంతో షాక్‌కు గురైంది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, తొలుత ఆమె భర్త హత్య చేసుంటాడని అనుమానం వ్యక్తం చేశారు స్పందన తరుఫు బంధువులు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా.. సీసీటీవీలో అడ్డంగా దొరికిపోయాడు మనోజ్ కుమార్.

Also read

Related posts

Share via