చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం ఎంపీటీసీ సభ్యుడు జగన్నాథరాజు కిడ్నాపర్ల చెరలో గుండెపోటుతో మృతి చెందారు
పాలసముద్రం: చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం ఎంపీటీసీ సభ్యుడు జగన్నాథరాజు కిడ్నాపర్ల చెరలో గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ద్వారా వాయిదాల పద్ధతిలో జేసీబీ కొనుగోలు చేశాడు. నెలవారీ వాయిదాల చెల్లింపులో జాప్యం జరగడంతో రుణ సంస్థ నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం గంగాధర నెల్లూరు మండలంలో సొంత పనుల్లోఉన్న జగన్నాథరాజును రుణ సంస్థ ప్రతినిధులు అపహరించారు. విజయవాడకు వాహనంలో తీసుకెళ్తుండగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు రుణ సంస్థ ప్రతినిధులపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





