ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో మానవ సంబంధాలను మంటగలిపే దారుణం జరిగింది. సొంత చెల్లినే అన్న అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. మృతదేహాన్ని 70కి.మీ. దూరంలో ఉన్న మామిడితోటలో పడేశాడు. అసలు ఎందుకు చంపాడు.. ఏం జరిగింది అనేది తెలుసుకుందాం..
మానవ సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయడానికి ఈ ఘటనే నిదర్శనం. డబ్బు కోసం మనిషి ఎంతకైన తెగిస్తున్నాడు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఘోరం జరిగింది. డబ్బు కోసం ఒక వ్యక్తి తన సొంత చెల్లినే..అన్న అత్యంత దారుణంగా హత్య చేసిన భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఆమెను గొంతు కోసి చంపి, ఆపై శరీరాన్ని ముక్కలు చేసి, ఒక సంచిలో కుక్కి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో కుషినగర్ జిల్లాలోని చెరకు తోటలో పడేశాడు.
నయా గ్రామానికి చెందిన చింకు నిషాద్ అనే వ్యక్తికి ఇటీవల నాలుగు లేన్ల ప్రాజెక్టు కోసం సేకరించిన భూమికి గాను రూ.5 లక్షల పరిహారం లభించింది. చింకు పెద్ద కొడుకు రామ్ ఆశిష్ ఆ డబ్బులో తన వాటాగా రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే చింకు ఆ డబ్బును తన చిన్న కూతురు నీలం పెళ్లి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి నిర్ణయంతో ఆగ్రహించిన రామ్ ఆశిష్.. చెల్లిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు.
తల్లిదండ్రులు లేని సమయంలో..
చింకు నిషాద్ భార్య ఇస్రావతి దేవి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళగా.. చింకు పశువులను మేపడానికి పొలాలకు వెళ్ళాడు. ఆ సమయంలో నీలం ఇంట్లో ఒంటరిగా ఉంది. సాయంత్రం 4 గంటల వరకు నీలం ఇంటి బయట కనిపించింది.. కానీ 6 గంటల తర్వాత నిందితుడు రామ్ ఆశిష్ బైక్‌పై ఒక పెద్ద సంచితో బయలుదేరడం గ్రామస్తులు చూశారు. చింకు ఇంటికి తిరిగి వచ్చేసరికి నీలం కనిపించలేదు. పొరుగువారిని విచారించినా ఫలితం లేకపోయింది.
ఇంట్లో పగిలిన దీపం, గొడవ జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, రామ్ ఆశిష్ పెద్ద సంచిని మోసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. నేరం ఒప్పుకున్నాడు. చెల్లి పెళ్లికి డబ్బు ఖర్చు అవుతుండటం చూసి కోపంతో గొంతు కోసి చంపి, ఆపై శరీరాన్ని ముక్కలు చేసి, కుషినగర్ జిల్లాలోని కప్తాన్‌గంజ్ సమీపంలోని చెరకు తోటలో పడేశానని తెలిపాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన తమ కొడుకుకు మరణశిక్ష విధించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కోడలిపై కూడా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు
Also read
- Wanaparthy: వివాహేతర సంబంధం మోజులో… ప్రియుడితో కలిసి భర్త హత్య
- Crime news: ఆరో తరగతి విద్యార్థినిపై అకృత్యం
- Bengaluru: ప్రవర్తనను ప్రశ్నించిందని.. తల్లిని చంపిన కుమార్తె
- తల నరికి, చేతుల వేళ్లు తొలగించి.. మహిళ దారుణ హత్య
- Kashibugga Temple Tragedy: కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది మృతి..





