SGSTV NEWS
CrimeNational

Sabarimala Gold Case: శబరిమల గోల్డ్‌ కేసు దర్యాప్తులో సంచలన ట్విస్ట్‌.. బళ్లారిలో పట్టుబడిన బంగారం..



శబరిమల గోల్డ్‌ కేసు దర్యాప్తు కీలకమలుపు తిరిగింది. ఆలయంలో మాయమైన బంగారం కర్నాటకలోని బళ్లారిలో పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. 476 గ్రాముల పసిడిని స్వాధీనం చేసుకుంది కేరళ సిట్‌.. బళ్లారికి చెందిన రొద్దం జువెలర్స్‌ను సీజ్‌ చేశారు. రొద్దం జువెలర్స్‌ యజమాని గోవర్థన్‌ను సిట్‌ అదుపులోకి తీసుకుంది. గోవర్థన్‌ను సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

శబరిమల గోల్డ్‌ కేసు దర్యాప్తు కీలకమలుపు తిరిగింది. ఆలయంలో మాయమైన బంగారం కర్నాటకలోని బళ్లారిలో పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. 476 గ్రాముల పసిడిని స్వాధీనం చేసుకుంది కేరళ సిట్‌.. బళ్లారికి చెందిన రొద్దం జువెలర్స్‌ను సీజ్‌ చేశారు. రొద్దం జువెలర్స్‌ యజమాని గోవర్థన్‌ను సిట్‌ అదుపులోకి తీసుకుంది. గోవర్థన్‌ను సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2019లో గోవర్థన్‌కు బంగారాన్ని ఉన్నికృష్ణన్‌ పొట్టి విక్రయించట్టు గుర్తించారు. ఉన్నికృష్ణన్‌కు, గోవర్థన్‌కు మధ్య లావాదేవీలపై సిట్‌ ఫోకస్‌ పెట్టింది.

శబరిమల బంగారం మాయం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్‌ ఇచ్చిన సమాచారంతో సిట్‌ అధికారులు బళ్లారిలో అలాగే.. బెంగళూరులో సోదాలు చేశారు. ఉన్నికృష్ణన్‌ను త్వరలో సిట్‌ బృందం చెన్నైకి తీసుకెళ్లనుంది. ఉన్నికృష్ణన్‌ అందించిన సమాచారం ప్రకారం.. తనిఖీలను ముమ్మరం చేయనున్నారు.

శబరిమల బంగారు తాపడం వివాదంలో కేరళ సీఎం విజయన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తిరువనంతపురంలో సెక్రటేరియట్‌ ముందు 24 గంటల పాటు దీక్షను కొనసాగిస్తున్నారు కేరళ బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖరన్‌..

బంగారు పూతతో ఉన్న ఆ రాగి తాపడాలకు మరమ్మతుల పనులను స్పాన్సర్ చేసేందుకు ఉన్నికృష్ణన్ 2019లో ముందుకొచ్చారు. వాటిని తొలగించే సమయంలో బరువు 42.8 కిలోలుగా ఉంది. తాపడాల మరమ్మతుల తరువాత తూచి చూడగా బరువు 38.28 కేజీలుగా తేలింది. దీంతో ఈ వివాదం రాజుకుంది.

కాగా.. ఈ కేసులో అరెస్టయిన ఉన్నికృష్ణన్‌ అక్టోబర్ 30 వరకూ సిట్ కస్టడీలో ఉండనున్నారు.. అయితే.. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి రావడంతోపాటు.. బంగారం గుట్టు బయటపడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Also read

Related posts