ఓ సూట్ కేస్ రోడ్డు పక్కన ఉండటాన్ని గుర్తించారు స్థానికులు. దాని నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సూట్ కేస్ తెరిచి చూడగా మహిళ మృతదేహం కనిపించింది. ఇంతకు ఏమైందంటే..?
చట్టాలు మారుతున్నా, శిక్షలు మరింత కఠినతరం చేస్తున్నా మహిళలపై దారుణాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట అత్యాచారాలకు, హత్యలకు గురౌతూనే ఉన్నారు ఆడవాళ్లు. ఇంటా, బయట, పని ప్రదేశాల్లో మహిళలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. బాగా తెలిసిన వ్యక్తులతోనే కాదు.. ముఖ పరిచయం లేని వ్యక్తుల చేతుల్లో కూడా హతమౌతున్నారు. అందుకు ఉదాహరణ ఈ ఘటన. పొట్ట కూటి కోసం తన పని తాను చేసుకునేందుకు వెళితే.. కస్టమర్ చేతిలో హతమౌంది ఓ మహిళ. ఆమెను చంపి సూట్ కేసులో కుక్కి రోడ్డుపై పడేశాడు. రక్తపు మరకలతో కూడిన సూట్ కేసును చూసిన స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సూట్ కేస్ తెరిచి చూడగా.. ముక్కలుగా నరికి ఉన్న మహిళ మృతదేహం లభించింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణ హత్య తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది.
చెన్నైలోని దక్షిణ శివారు ప్రాంతంలో సంచలనం సృష్టించింది ఈ హత్య. ఈ భయానక ఘటనలో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొరైపాక్కం కుమారన్ నగర్ నివాస ప్రాంతంలో అనుమానాస్పద రీతిలో ఓ సూట్ కేస్ చూశారు స్థానికులు.. దాని నుండి దుర్వాసన రావడంతో భయబ్రాంతులకు గురై.. పోలీసులకు ఫోన్ చేశారు. వచ్చి చూడగా.. అందులో మహిళ ముక్కలుగా నరికిన మహిళా మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలిని దీపగా గుర్తించారు. ఆమె ఒక సెక్స్ వర్కర్ అని విచారణలో తేలింది. మూడు రోజుల క్రితం నుండి ఆమె ఆచూకీ లభించలేదని తెలిసింది. దీంతో పోలీసులు.. ఈ హత్య ఎవరు చేసి ఉంటారన్న కోణంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. ఓ వ్యక్తి సూట్ కేస్ వదిలేసి వెళుతున్నట్లు గుర్తించారు.
ఎంక్వైరీ చేయగా.. అతడు శివగంగ జిల్లాకు చెందిన మణికందన్ అని తేలింది. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయాలు వెలుగు చూశాయి. దీప సెక్స్ వర్కర్ కాగా, ఓ మధ్యవర్తి ద్వారా ఆమెను బుక్ చేసుకున్నాడు మణికందన్. దీంతో ఆమె తొరైపాక్కం వచ్చింది. ఆమెతో ఎంజాయ్ చేసిన మణికందన్ డబ్బు చెల్లించే విషయంలో దీపతో గొడవ పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఊగిపోయిన మణి.. ఆమెను సుత్తితో తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాగా, రెండు రోజుల పాటు ఆమె శవాన్ని ఇంట్లో ఉంచాడు. అనంతరం సూట్ కేస్ ఆర్డర్ పెట్టి.. శవాన్ని ముక్కలుగా కోసి.. అందులో పెట్టి.. రోడ్డుపై పడేశాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మరింత దర్యాప్తు చేపడుతున్నారు.
Also read
- Gurumurthy: మొదట కాళ్లు.. తర్వాత తల.. మాధవిని ఎంత క్రూరంగా నరికాడంటే..!
- Kasturba Hostel: కస్తూర్భా హాస్టల్లో ఘోరాలు.. నెలసరి ప్రూఫ్ చూపించాలంటూ టీచర్స్ టార్చర్!
- మెడికల్ స్టూడెంట్‌గా పరిచయమై అసలు కథ మొదలుపెడుతుంది.. వామ్మో.. నిత్య పెళ్లి కూతురు నిషాంతి గురించి తెలిస్తే..
- Hyderabad: మహిళను చంపింది అతనే.. నిందితుడిని పట్టించిన కండోమ్.. మేడ్చల్ ఘటనలో సంచలన విషయాలు..
- Telangana: కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో అఘోరీ నాగసాధువు హల్చల్.. ఏకంగా కత్తితో..!