కరీంనగర్ జిల్లాకి చెందిన మమత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని వెల్లడించారు. భర్తను వదిలి.. భాస్కర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భాస్కర్ కుటుంబమే మమతను హతమార్చినట్లు తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు.
గత ఐదు రోజుల క్రితం తెలంగాణ (Telangana) లో మమత అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. బెల్లం పల్లికి చెందిన మమతను గుర్తు తెలియని దుండగులు జనవరి 27న హత్య చేసి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో వదిలేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మర్డర్ కేసు మిస్టరీ వీడింది.
మమత హత్యకు వివాహేతర సంబంధమే (Extramarital Affair) కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో 5గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాసిపేటకు చెందిన మమత.. భరత్ అనే వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం కొన్నాళ్లు బాగానే ఉన్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
అయితే అనివార్య కారణాల వల్ల వీరిమధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో భర్త భరత్‌తో మమత విడిగా ఉంటుంది. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన సింగరేణి ఉద్యోగి భాస్కర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి మమత మాయలో పడ్డ భాస్కర్.. తన జీతం డబ్బులను ఆమెకు ఇవ్వడం స్టార్ట్ చేశాడు.
దీంతో భాస్కర్ కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే భాస్కర్ అక్క నర్మద.. మమతను చంపేందుకు స్కెచ్ వేసింది. తన ఫ్రెండ్ రఘుతో కలిసి హత్యకు ప్లాన్ గీసింది. అనంతరం లక్సెట్‌పేటకు చెందిన కళ్యాణ్‌కు రూ.5లక్షలు సుపారీ ఇచ్చింది. దీంతో సుపారీ గ్యాంగ్ గత నెల 27న మమతకు మాయమాటలు చెప్పి కారులో ఎక్కించారు. అర్థరాత్రి వరకు కారులోనే తిప్పారు. అనంతరం మమతను కత్తితో పొడిచి నైలాన్ తాడుతో బిగించి హత్య చేశారు. ఆపై కరీంనగర్ జిల్లా కొండనపల్లి శివారులో పడేశారు.
Also read
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..





