సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది.
కోదాడ గ్రామీణం: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. నగదు ఉన్న పెట్టె ఓపెన్ కాకపోవడంతో ఆశ వదులుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడికి కొద్దిసేపటి తర్వాత ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అందులోని నగదు కాలిపోయింది. ఉదయం బ్యాంక్ సిబ్బంది వచ్చి చూసిన తర్వాత విషయం బయటపడింది. సంఘటన స్థలాన్ని గ్రామీణ ఎస్సై అనిల్ రెడ్డి పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం