హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ, చిత్రపరిశ్రమలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ జీవనం సాగిస్తున్న ఒక యువతిని సినిమాపేరుతో ఇద్దరు యువకులు మోసం చేశారు..షూటింగ్ ఉందంటూ తీసుకెళ్లి బంధించి రెండు రోజుల పాటు లైంగికదాడి చేశారు.
Crime News : సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ అమాయక యువతులను నమ్మించి, వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘోరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ, చిత్రపరిశ్రమలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ జీవనం సాగిస్తున్న ఒక యువతి ఇలాంటి మోసానికే బలైంది. సినిమా షూటింగ్ ఉందంటూ నమ్మబలికిన ఒక యువకుడు, ఆమెను నమ్మించి సికింద్రాబాద్‌లోని ఒక గదికి తీసుకువెళ్లాడు. అక్కడ సదరు యువకుడు తన స్నేహితుడితో కలిసి, ఆ యువతిని బంధించి రెండు రోజుల పాటు పదే పదే లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితులు ఏమీ తెలియనట్టుగా ఈనెల 16న ర్యాపిడో బైక్ బుక్ చేసి బాధితురాలిని తిరిగి ఇంటికి పంపించివేశారు. ఇంటికి చేరుకున్న బాధితురాలి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉండటాన్ని గమనించిన ఆమె రూమ్మేట్ (స్నేహితురాలు), వెంటనే అప్రమత్తమై ఆమెను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించింది. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి గాయాల గురించి ప్రశ్నించగా, తనపై ఇద్దరు యువకులు రెండు రోజుల పాటు జరిపిన అఘాయిత్యాన్ని బాధితురాలు కన్నీటిపర్యంతమవుతూ వివరించింది.
వైద్యుల సూచనలు, స్నేహితురాలి మద్దతుతో బాధితురాలు ఈ ఘోర ఉదంతంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చిత్రపరిశ్రమలో అవకాశాల పేరిట జరిగిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరు గుర్తుతెలియని యువకులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, సికింద్రాబాద్‌లోని సదరు ప్రాంతపు సీసీటీవీ ఫుటేజీలను, మొబైల్ సిగ్నల్స్ ఆధారాలను సేకరిస్తూ సమగ్ర దర్యాప్తును వేగవంతం చేశారు.
Also read
- విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?





