Crime News: మియాపూర్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడగా, పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, కాకినాడకు చెందిన నూకరత్నం అనే మహిళ మియాపూర్‌లో హౌస్కిపింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. గతంలోనే భర్తను కోల్పోయిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఆమె ప్రసాద్ అనే వ్యక్తిని గత నెల 20న వివాహం చేసుకుంది.
నూకరత్నంకు తీవ్ర గాయాలు
అదే ప్రాంతంలో వంటమనిషిగా పనిచేస్తున్న ఆలీషా అలియాస్ పాండు, నూకరత్నం తనకు చెప్పకుండా ప్రసాద్‌ను పెళ్లి చేసుకోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 19న తన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్‌తో కలిసి నూకరత్నం ఇంటికి వెళ్లి తన వెంట రావాలని ఒత్తిడి చేశాడు. అయితే ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన ఆలీషా వెంట తెచ్చుకున్న కత్తితో నూకరత్నంపై దాడి చేశాడు. ఈ దాడిలో నూకరత్నంకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి నిందితుడు ఆలీషా, అతని తండ్రి లాలూను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also read
- ఎమ్మెల్సీని టార్గెట్ చేసిన డీప్‌ఫేక్ గ్యాంగ్.. రూ.5 కోట్లకు బేరం.. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్..!
- ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు విషాదం.. MPTC అభ్యర్థి గుండెపోటుతో మృతి!
- జగిత్యాలలో 10 నెలల చిన్నారి మృతి
- Diwali: దక్షిణ భారతంలో దీపావళి అంటే నరకాసుర వధే.. శ్రీకృష్ణుడి విజయగాథ వెనుక అసలు కథ ఇదే!
- దీపావళి వేళ దర్శించాల్సిన మహాలక్ష్మీ ఆలయాలు.. ఈ ఆలయాల విశిష్టత తెలిస్తే తప్పక వెళ్లాలనిపిస్తుంది!




