చంద్రగిరి కి చెందిన ప్రసన్న భర్త గతేడాది జూలైలో మృతిచెందాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న ప్రసన్నకు కూతురు పుట్టింది. ప్రస్తుతం ఏడాది వయసున్న కూతురు దీక్షిత తో చంద్రగిరిలో నివాసముంటున్న ప్రసన్నకు సుబ్రమణ్యం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భర్తకు మంచి స్నేహితుడైన సుబ్రమణ్యంతో కాస్తా సహజీవనం
చంద్రగిరి, నవంబర్ 12: తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం గొడవ లో పసికందు మృతికి కారణమయ్యింది. భర్త మృతి చెందడంతో మరో వ్యక్తితో సహ జీవనం చేసిన తల్లి కన్న బిడ్డను పోగొట్టుకుంది. వివరాల్లోకెళ్తే..
చంద్రగిరి కి చెందిన ప్రసన్న భర్త గతేడాది జూలైలో మృతిచెందాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న ప్రసన్నకు కూతురు పుట్టింది. ప్రస్తుతం ఏడాది వయసున్న కూతురు దీక్షిత తో చంద్రగిరిలో నివాసముంటున్న ప్రసన్నకు సుబ్రమణ్యం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భర్తకు మంచి స్నేహితుడైన సుబ్రమణ్యంతో కాస్తా సహజీవనం కు కారణమైంది. గత కొంతకాలంగా సుబ్రహ్మణ్యంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ప్రసన్న వ్యవహారం సుబ్రమణ్యం భార్య ఉమకు తెలిసిపోయింది.
దీంతో భర్తను నిలదీసిన ఉమ ఈ రోజు బంధువులతో కలిసి ప్రసన్న ఇంటికి వచ్చింది. చంద్రగిరిలోని మూలస్తానమ్మ వీధి గుడిలో ఉంటున్న ప్రసన్నతో గొడవకు దిగి, దాడికి పాల్పడింది. ప్రసన్న, ఉమ మధ్య జరిగిన దాడి సమయంలో ప్రసన్న కూతురు ఏడాది చిన్నారి దీక్షిత ప్రియ తీవ్రంగా గాయపడింది. దాడి జరిగిన సమయంలో ప్రసన్న చేతిలో ఉన్న పసికందు దీక్షిత ను కింద పడేయడంతో పరిస్థితి విషమించింది. వెంటనే దీక్షితను చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి స్థానికులు తరలించారు. చికిత్స పొందుతూ దీక్షిత మృతి చెందింది. ప్రసన్న ఫిర్యాదుతో కేసు నమోదు నమోదు అయ్యింది. ప్రసన్న పై దాడి చేసి, దీక్షిత మృతికి కారకులైన సుబ్రహ్మణ్యం, అతని భార్య కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ మేరకు విచారిస్తున్నారు.
Also Read
- నేటి జాతకములు.14 నవంబర్, 2025
- సృజన్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి?
- కె జి హచ్ వైద్యం అందక గిరిజన పసికందు మృతి
- ఏడో తరగతి బాలుడిపై లైంగికదాడి
- భార్యపై అనుమానంతో దారుణం చేసిన భర్త






మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..