SGSTV NEWS online
Andhra PradeshCrime

చికెన్ కర్రీ ఎంత పనిచేసింది.. ఏకంగా ఉద్యోగం పోగొట్టుకున్న ఏఎస్ఐ.. అసలు మ్యాటర్ ఏంటంటే..




తిరుపతి సత్యనారాయణపురంలోని ఒక కర్రీ పాయింట్ వీరంగం సృష్టించిన ఎస్పీఎఫ్ ఏఎస్ఐపై ఉన్నతాధికారులు వేడు వేశారు. అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తిరుమలలో ఎస్పీఎఫ్ ఏఎస్ఐగా పనిచేస్తున్న రాములు పూర్విక కర్రీ పాయింట్ వద్ద శీను అనే వ్యక్తితో గొడవ పడ్డారు. రోడ్డుపై ఇద్దరూ పిడిగుద్దులు పట్టుకొని ఘర్షణ పడడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో అసలు గొడవ ఎందుకన్నది ఆసక్తికరంగా మారింది. పోలీసులు స్థానికుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి కర్రీ పాయింట్ వద్దకు వెళ్లిన ఏఎస్ఐ రాములు రోడ్డు పై నుంచే చికెన్ కర్రీ ఆర్డర్ చేసాడు. రోడ్డుపై బైక్ పై ఉండే తన దగ్గరికి తెచ్చి ఇవ్వాలని మహిళలను ఆదేశించాడు ఏఎస్ఐ రాములు. అప్పటికే కర్రీ పాయింట్ వద్ద ఉన్న కస్టమర్లు వచ్చి తీసుకెళ్లమని చెప్పారు. దీంతో నన్నే వచ్చి తీసుకెళ్లమంటావా..? అంటూ గొడవకు దిగాడు. అనుచితంగా మాట్లాడంతోపాటు.. శీను అనే వ్యక్తితో గొడవపడ్డాడు.. తాను పోలీసు అంటూ ఏఎస్ఐ రాములు దుర్భషలాడాడు… దీంతో శీను.. ఏఎస్ఐ ఇద్దరూ రోడ్డుపై బాహాబాహీకి దిగారు.


ఈ లోపు కర్రీ పాయింట్ నిర్వహిస్తున్న మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే.. కర్రీ పాయింట్ యజమాని ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న బ్లూ కోట్స్ పోలీసులు ఇద్దరిని అలిపిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేసి.. డ్రంక్ అండ్ డ్రైవ్ టేస్ట్ నిర్వహించారు.

మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించినట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో ఏపీఎస్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వీవీ రామిరెడ్డి ఆదేశాలతో రాములును ఉన్నతాధికారులు శుక్రవారం సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి డీఎస్పీ తెలిపారు.

Also read

Related posts