పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఒక సామాన్య పాస్టర్ ఇంట్లో బయటపడిన కోట్ల రూపాయల నగదు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. పక్కా సమాచారంతో పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కోట్ల రూపాయల నగదు నిల్వ వ్యవహారం కలకలం రేపింది. అందులోనూ ఒక సామాన్య పాస్టర్ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు నిల్వలు ఉండటం తీవ్ర చర్చకు దారితీసింది. నిల్వ ఉంచిన డబ్బుకు లెక్కలు లేకపోవడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఓ పాస్టర్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ చూసేసరికి పోలీసుల కళ్లు చెదిరాయి .వీరికి కోట్ల రూపాయలు ఎక్కడివి.? హైదరాబాద్లో వీరి వ్యాపారం ఏంటి.? అనే దానిపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పీచుపాలెంలో నివాసం ఉంటున్న పాస్టర్ ఘంటా జాన్ బాబూరావు ఇంట్లో ఈ నగదు దొరికింది. పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. లెక్కలలో లేని రూ. 2.27 కోట్లు గుర్తించారు. నగదుపై పాస్టర్ కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు నగదును సీజ్ చేశారు. పాస్టర్ అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి నరసాపురం అనధికార నగదు రూ. 50 లక్షలు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఇంటికి రాగానే దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో సోదాలు చేయగా మిగతా నగదు దొరికింది. నగదు గురించి పొంతన సమాధానాలు చెప్పడంతో పాస్టర్ జాన్ బాబూరావు, శాంసన్లపై కేసు నమోదు చేసి.. వీరికి ఈ నగదు ఎలా వచ్చింది.? ఎక్కడి నుంచి వచ్చింది.? వీరి కుటుంబ సభ్యుల వ్యాపారాలుపై పోలీసులు విచారణ చేపట్టారు. నగదును ఐటి శాఖకు అప్పజెప్పనున్నట్లు రూరల్ సిఐ దుర్గప్రసాద్ తెలిపారు. ఈ నగదు మార్పిడిలో హవాలా కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also read
- రావమ్మా మహాలక్ష్మి.. ఆదివారం అక్షయ తృతీయ.. ఇదొక్కటి చేస్తే మీ ఇంట్లో ధన వర్షం కురవాల్సిందే
- Weekly Horoscope: వారి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్..12 రాశుల వారికి వారఫలాలు
- అద్దె ఇల్లు చూసేందుకు వచ్చి మహిళ ఆత్మహత్య
- సైబర్ మాయాజాలం.. క్లిక్ చేస్తే కైలాసమే.. అప్రమత్తతే అసలైన కవచం!
- విందులో విషాదం.. చిన్న మాంసం ముక్క.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది!





