నంద్యాల జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. “తల్లిదండ్రులకు భారం అయ్యాను.. నా శవాన్ని చెత్తకుప్పలో వేయండి” అంటూ చిరంజీవి రాసిన సూసైడ్ లెటర్ ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. పేదరికం, నిరుద్యోగం, కుటుంబ బాధ్యతల ఒత్తిడితో జీవితంపై విరక్తి చెందిన యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా ఆవేదన కలిగిస్తోంది.
నంద్యాల జిల్లా పొన్నాపురం రైల్వే గేట్ వద్ద చోటుచేసుకున్న ఓ యువకుడి ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులకు భారం అయ్యాను.. నా శవాన్ని చెత్తకుప్పలో వేయండి అంటూ రాసిన సూసైడ్ లెటర్ చదివిన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఆళ్ళగడ్డ మండలం పడకండ్ల గ్రామానికి చెందిన చిరంజీవి అనే యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో అందరినీ ఎక్కువగా కలిచివేసింది యువకుడు రాసిన సూసైడ్ లెటర్. జీవితం మీద విరక్తి, కుటుంబంపై ప్రేమ, తన వల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారనే ఆవేదన ప్రతి అక్షరంలో కనిపింస్తూంది
సరైన సంపాదన లేక తల్లిదండ్రులకు ఉపయోగపడలేకపోయాను… నా కోసం ఎవరూ బాధపడొద్దు అంటూ రాసిన మాటలు చదివిన వారిని భావోద్వేగానికి గురిచేస్తూంది. పేదరికం, నిరుద్యోగం, కుటుంబ బాధ్యతలు యువత మనసులపై ఎంతటి ఒత్తిడిని పెడుతున్నాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆళ్ళగడ్డ మండలం పడకండ్లకు చెందిన మున్నెయ్యకు నలుగుగు సంతానం కలిగి చనిపోయారు. ఐదో సంతానంగా పుట్టిన కొడుకు పుట్టుకతోనే అనారోగ్యంతో పుట్టాడు. లక్షల రూపాయలు అప్పు చేసి అతనిని బ్రతికించారు. అతనికి చిరంజీవి అని పేరు పెట్టాడు. చిరంజీవి పుట్టినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోని చివరకి నంద్యాల ఎన్జీఓ కాలనిలో ఎలక్ట్రిషన్‌గా పని చేస్తూ జీవిస్తున్నాడు
ఈ నేపథ్యంలో ఏమైందో ఏమో జీవితంపై విరక్తి చెందిన చిరంజీవి స్థానిక పొన్నాపురం లో రైల్వే ట్రాక్‌పై ట్రైన్‌కు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసులున్న రైల్వే ఎస్సై కుమారి సిబ్బందితో కలసి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. మృతుడి ప్యాంట్ జేబులో లభించిన సూసైడ్ లెటర్ చదివి భావోద్వేగానికి లోనయ్యారు.
తన జీవతంలో ఏమి సాదించలేదని, లక్షలు అప్పు చేసి తనను బ్రతికించిన తల్లిదండ్రులకు తాను భారం అయ్యానని తన మృతదేహాన్ని ఇచ్చి వాళ్లను ఇబ్బంది పెట్టకండి,నా మృతదేహాన్ని కుక్కలకు కానీ, చెత్తకుప్పలో కాని వెయ్యండి అంటు ఎంతో అవేధనతో లెటర్ రాసాడు. ఇదే తన చివరి కోరిక అంటూ భావోద్వేగంతో లేఖను ముగించాడు.
ఈ ఘటన ద్వారా బయటకు నవ్వుతూ కనిపించే చాలామంది యువకులు లోపల ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నారో కుటుంబ సభ్యులు, స్నేహితులు గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్‌గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





