కాకినాడ జిల్లాలో పెను విషాదం వెలుగు చూసింది. పెళ్లైన ఐదు నెలలకే ఓ ఇల్లాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్త, భర్త వేధింపులు భరించలేకనే ఈ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు.. తన చావుకు వారిద్దరే కారణమని ఆ ఇల్లాలు సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అత్త, భర్తే తన చావుకు కారణమని సూసైడ్ లెటర్ రాసి మరి ఒక వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానంతో గల కొన్ని రోజులుగా భర్త, అత్తింటి వారు పెడుతున్న టార్చర్ తల్టుకోలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని బాధిత తండ్రి ఆరోపిస్తున్నాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదుకొని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన శిరీషకు అదే గ్రామానికి చెందిన ఏనుగుతల ప్రదీప్‌కుమార్‌తో గత ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత వీరు గోపాలపట్నంలో ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ప్రదీప్ స్థానికంగా ఉంటున్న ఒక దివీస్ పరిశ్రమలో పనిచేస్తుండగా శరీష అత్తతో పాటు ఇంట్లోనే ఉంటుంది. అయితే శరీషకు తమకు తెలియకుండా గత కొన్ని రోజులుగా ఇన్‌స్ట్రా గ్రామ్‌లో ఎవరితోనో చాట్ చేస్తుందని అనుమానించిన భర్త ప్రదీప్, అత్త ఆమెను టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు.
దీంతో అత్తింటి వేధింపులు తట్టుకోలేకపోయిన శిరీష బుధవారం తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయాలను చెప్పింది. అత్త, భర్త వేధింపులు భరించలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత మళ్లీ తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా శిరీష తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన తండ్రి వెంటనే గోపాలపట్నం బయల్దేరాడు. తండ్రి ఇంటికి వచ్చేలోపు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని వేలాడుతూ కనిపించింది శిరీష అది చూసి తండ్రి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
వెంటనే కూతురి దగ్గరకు పరిగెత్తి బిడ్డను కిందకు దించాడు. అప్పుడు తండ్రి ఆ పక్కనే ఒక సూసైడ్ లెటర్ కనిపించింది. అందుతో తన చావుకు అత్త, భర్త ప్రదీప్ కారణమని రాసి ఉంది. దీంతో తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటీన అక్కడికి చేరకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Malavya Rajyog 2025: వచ్చే నెలలో ఏర్పడనున్న మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశులకు మహర్దశ ప్రారంభం..
- నేటిజాతకములు …24 అక్టోబర్, 2025
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్‌గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే