పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఉద్యోగినిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె కాళ్లు, చేతులు కట్టివేసి, వివస్త్రను చేసి, జననాంగంపై ఇనుప చువ్వతో దాడి చేశాడు. మహిళపై వికృతంగా దాడి చేసిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. ఆమె ప్రియుడే దాడికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఈ నెల ఈస్టర్ పండుగ ముందు రోజు సత్తెనపల్లి వెళ్లేందుకు మహిళ సిద్దమైంది. అయితే, ఆమె ఒంటరిగా ఉన్నట్లు గమనించిన వ్యక్తి మంచినీళ్లు కావాలంటూ వచ్చి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమెకు కొడుకు ఫోన్ చేయగా అటెండ్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె కొడుకు స్నేహితులను తల్లి ఉంటున్న ఇంటి వద్దకు పంపించాడు. అయితే ఆమె కాళ్లు చేతులు కట్టేసి, వివస్త్ర గా పడిఉండటాన్ని గుర్తించిన స్నేహితులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు కూడా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అత్యాచారం చేశాడని చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు పలు అనుమానాలు వచ్చాయి. బాధితురాలి ఇంట్లో భోజనం పార్శిల్ ఉండటాన్ని గమనించారు. అదే విధంగా మద్యం బాటిల్స్ ఉన్నాయి. దీంతో ఆమెకు తెలిసిన వ్యక్తే వచ్చి ఉంటాడని పోలీసులు మొదట నుండి భావిస్తూ వచ్చారు. అయితే బాధితురాలు నోరు విప్పక పోవడంతో పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించడంపై దృష్టి పెట్టారు. మొదట సిసి కెమెరా విజువల్స్ జల్లెడ పట్టారు. అందులోనూ కీలకమైన అంశాలేమీ పోలీసులకు దొరకలేదు. ఆ తర్వాత మహిళా సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని వాట్సాప్ డేటా రిట్రీవ్ చేశారు. దీంతో ఆమె ప్రియుడే దాడి చేసినట్లు గుర్తించారు. వాట్పాస్ చాటింగ్ లో నిందితుడు రాజుపాలెం మండలానికి చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు.
అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. మరొకవైపు బాధితురాలు కూడా కోలుకొని ఆసుపత్రి నుండి ఢిఛార్జ్ అయింది. దీంతో ఆమె వద్ద నుండి కీలక సమాచారం రాబట్టారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన అత్యాచారం కేసులో పోలీసులు ముందడుగు వేసి ఆమె ప్రియుడే దాడికి పాల్పడినట్లు గుర్తించారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చూపించే అవకాశం ఉంది.
Also read
- జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు తెలుసుకోవాల్సిన ఆచారం ఇదే!
- నాలుగు నవరాత్రులు.. నాలుగు శక్తి స్వరూపాలు! ఏ నవరాత్రిలో ఏ అమ్మవారిని పూజిస్తారో తెలుసా?
- Navratri: దేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలు ఇవే.. నవరాత్రుల్లో దర్శిస్తే ప్రత్యేకమే!
- నేటి జాతకములు 9 అక్టోబర్, 2026
- మోనాలిసా అమ్మాయి అనుకున్నాడు.. గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే, ఆ ఒక్క ఫోన్ కాల్తో..





