ఒక టీ షాపులో వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని ఓ మున్సిపల్ అధికారి ఆవేశంతో ఊగిపోయారు. అరగంటలో ప్రోక్లైన్‌తో అక్కడికి వచ్చారు. షాపు ముందు ఉన్న ర్యాంపు తొలగించడానికి ప్రయత్నం చేశారు. అంతే సీన్ అంతా ఒక్కసారిగా రివర్స్ అయింది. అసలు ఏం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం..
ప్రొద్దుటూరు నగరంలో ఉన్న టీ షాపు వద్దకు ఓ మున్సిపల్ అధికారి.. అతనితో పాటు మరో ఇద్దరు కాఫీ తాగడానికి వచ్చారు. అయితే వన్ బై త్రీ కాఫీని ఇవ్వాలని ఆ హోటల్ వారిని కోరారు.. అయితే.. వారు తమ దగ్గర ఇలాంటి పద్ధతి లేదని సమాధానం ఇచ్చారు. దీంతో ఆ హోటల్‌లో ఉన్న సిబ్బందిపై కొద్దిసేపు వాదించిన అధికారి.. ఓ అరగంట తర్వాత జెసిబీతో ఆ హోటల్ ముందు ప్రత్యక్షమయ్యారు. హోటల్ మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించుకుందని, డ్రైనేజీ పై రాంప్ ఎందుకు కట్టారని హోటల్ యజమానితో వాగ్వాదానికి దిగారు. దానిని తొలగిస్తామని పేర్కొన్నారు. దీంతో అధికారి.. హోటల్ యమమాని మధ్య వాదన జరిగింది.
దీంతో చేసేదేమీ లేక ఆ హోటల్ యజమాని జేసీబీ ముందు పండుకొని నిరసన తెలిపారు. నా పైనుంచి ఎక్కించి ర్యాంప్ కూల్చాలని నిరసన తెలిపాడు.. నగరమంతా డ్రైనేజీ లపై ఈ విధంగానే ఉన్నాయని.. తాను ఒక్కడినే దానికి సమస్య కాదు.. అంటూ హోటల్ యజమాని అధికారులతో వాదించారు..
దీంతో చేసేదేమీ లేక ఆ మున్సిపల్ అధికారి వెనక్కి తగ్గక తప్పలేదు. దీనికి సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రొద్దుటూరులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.. ఈనెల నాలుగవ తేదీన ఈ సంఘటన చోటుచేసుకుంది
Also read
- శ్రీశైలం డ్యామ్ వద్ద ఘోరం.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ను వెంటాడి చంపేశారు..! హంతకులు ఎవరంటే?
- ప్రియుడి మోజులో పడి భర్తను ఏం చేసిందంటే..
- విజయవాడ ఉగ్ర లింకుల కేసు.. విస్తుపోయే నిజాలు.. హైదరాబాద్లో ఒకరి అరెస్ట్
- ఎంత పని చేశావ్ ఇషికా.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని నట్టింట్లోనే..
- ‘నాకు అమ్మా నాన్న లేరు సార్.. మీరే నాకు అమ్మా నాన్న! పాస్ చేయండి సార్..’





