ఒంటరిగా ఉంటున్న ఓ యాచకురాలిపై కన్నేసి ఆమెపై ఓ రౌడీ షీటర్ లైంగిక దాడికి ప్రయత్నించిన దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. స్థానికుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. నిందితుడిపై ఇప్పటికే రెండు అత్యాచారా కేసులు ఉన్నట్టు తెలిపారు.
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒంటరిగా ఉన్న ఓ యాచకురాలిపై ఓ కామాందుడు కన్నేశాడు. ఎవరూ లేని సమయం చూసి ఆమెపై ఆఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. అయితే నిందితుడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు కేకలు వేయడంతో.. అతను అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు వైరల్ అవ్వడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకాకానికి చెందిన సాంబశివరావు అనే వ్యక్తి ఆటో నడుపుడంతో పాటు రౌడీ షీటర్‌గా సెటిల్మెంట్లు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఇతనిపై ఇప్పటికే రెండు అత్యాచార కేసులు కూడా ఉన్నాయి. అయితే రెండు రోజుల క్రితం పెదకాకానిలోని రోడ్డు పక్కనే ఉన్న పూల దుకాణంలో ఒక యాచకురాలు నిద్రిస్తుండడం ఇతను గమనించాడు. అమెపై కన్ననేసిన ఆ కామాందుడు అర్ధరాత్రి సమయంలో ఆమెకు వద్దకు వెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అయితే అతన్నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు నిందితుడు.
అయితే ఆమె ఏడుస్తూ కేకలు పెట్టడంతో కుక్కలు కూడా మొరగడం మొదలు పెట్టాయి. అలాగే స్థానికులు వస్తున్న అలికిడి కావడంతో ఆమెతో కొద్ది సేపు పెనుగులాడిన సాంబశివరావు అక్కడ నుండి పారిపోయాడు. ఇది గమనించిన స్థానికులు ఈ విషయాన్ని పెదకాకాని పోలీసులకు చేరవేశారు. దీంతో అక్కడే ఉన్న సిసి కెమెరా విజువల్స్ ను సేకరించిన పోలీసులు సాంబశివరావును గుర్తించి అరెస్ట్ చేశారు. అతనిపై ఇప్పటికే రెండు అత్యాచార కేసులున్నాయని గతంలో జైలుకు వెళ్లి వచ్చాడని సిఐ నారాయణ స్వామి తెలిపారు.
Also read
- నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం వెలిగించాలా? సరైన పద్ధతి ఇదే!
- Durga Puja: దుర్గాదేవి బొట్టు కింద చిన్న సాలీడు.. దాని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
- సైన్స్ కు సైతం అంతుచిక్కని పవర్ ఫుల్ శక్తిపీఠాలు.. !!
- Astrology: శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





