శ్రీ సత్యసాయి జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పక్కింటి పెరట్లో జామపండు కోసిందన్న కోపంతో ఆరేళ్ల చిన్నారిపై ఓ వృద్ధురాలు విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పరిగి మండలం ఊటకూరు గ్రామంలో కలకలం రేపింది.
శ్రీ సత్యసాయి జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పక్కింటి పెరట్లో జామపండు కోసిందన్న కోపంతో ఆరేళ్ల చిన్నారిపై ఓ వృద్ధురాలు విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పరిగి మండలం ఊటకూరు గ్రామంలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఊటకూరు గ్రామానికి చెందిన అల్ఫియా అనే ఆరేళ్ల చిన్నారి తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఈ క్రమంలో చిన్నారి ఇంటి పక్కనే ఉన్న పెరట్లో ఆడుకుంటూ జామపండు కోసింది. ఇది గమనించిన పక్కింటి వృద్ధురాలు మంజమ్మ ఆగ్రహంతో చిన్నారిపై దాడి చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాయితో బలంగా కొట్టడంతో చిన్నారికి తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగినట్లు తెలిపారు.
దాడిలో చిన్నారి అపస్మారక స్థితికి చేరుకోవడంతో భయపడిన వృద్ధురాలు కొద్దిసేపు చిన్నారిని తన ఇంట్లోనే ఉంచింది. మరోవైపు అల్ఫియా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గ్రామమంతా వెతికారు. ఈ క్రమంలో వృద్ధురాలి ఇంటి పెరట్లో రక్తపు మరకలు కనిపించడంతో అనుమానం వచ్చి ఆమెను నిలదీశారు. అయితే చిన్నారిని కుక్క కరిచిందంటూ వృద్ధురాలు సమాధానం చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న అల్ఫియాను గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పరిగి పోలీసులు వృద్ధురాలు మంజమ్మపై కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. చిన్నారిపై జరిగిన దాడి స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
Also read
- ఆంధ్రప్రదేశ్ : ఇన్స్టాగ్రామ్ చాటింగ్ వివాదంలో 16 ఏళ్ల యువకుడు కార్తీక్ మృతి
- మరో నాలుగు రోజుల్లో ఇంట్లో శుభకార్యం.. అంతలోనే రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!
- వివాహేతర సంబంధాల మోజులో కానిస్టేబుల్!
- హైదరాబాద్‌లో వేధింపుల కేసు నమోదు
- బంజారా హిల్స్‌లో స్నేహితుడి హత్య.. కత్తి కొనుగోలు ప్రణాళికతో





