Chittoor SITAMS Engineering College student suicide: చిత్తూరు జిల్లాలోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధి కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారం రోజుల వ్యవధిలో ఏకంగా ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. చిత్తూరులోని శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల వరస ఆత్మహత్యలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం
చిత్తూరు, నవంబర్ 5: చిత్తూరు జిల్లాలోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధి కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారం రోజుల వ్యవధిలో ఏకంగా ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. చిత్తూరులోని శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల వరస ఆత్మహత్యలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..
కొంగారెడ్డిపల్లికి చెందిన శశికుమార్, తులసిల కుమారుడు రుద్రమూర్తి (19). ఇదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న రుద్రమూర్తి మంగళవారం నాలుగో అంతస్తుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రుద్ర అక్కడికక్కడే మరణించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మృతదేహాన్ని పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యకు కళాశాల అధ్యాపకుల వేధింపులే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇవాళ రుద్ర మరణించడంతో తల్లిదండ్రులు బంధువులు సీతమ్స్ కళాశాల లోకి చొచ్చుకెళ్లి ఆందోళన దిగారు. ఆందోళన ఉద్రిక్తత మారింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులకు విద్యార్థులు తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రుద్ర ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని కాలేజీ యాజమాన్యం చెప్పడం విడ్డూరంగా మారింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు భారీ సంఖ్యలో కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకుని లోపలికి ఎవరినీ రాకుండా అడ్డుకున్నారు.
పోలీసులు మహిళలను లాగి పడేయడంతో ఇద్దరు మహిళలు స్పృహ తప్పారు. అస్వస్థతకు గురైన మహిళలను 108 ద్వారా ఆసుపత్రిలు తరలించారు. రుద్ర మృతికి కళాశాల డీన్ కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. యాజమాన్యం కనీసం సమాచారం కూడా సకాలంలో అందించలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు గత నెల 31వ తేదీ కళాశాలలోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మూడవ అంతస్తు నుండి నందిని అనే విద్యార్థి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వేలూరు సిఎంసి ఆసుపత్రిలో నందిని తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. అయితే చిత్తూరు తాలూకా పోలీసులు ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేశారు. వరుసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమా లేదా ఏ ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు ఘటనలు ఒకే కళాశాలలో జరగడం తల్లిదండ్రులలో ఆందోళనకు గురిచేస్తుంది.
Also read
- నవ జనార్ధనల క్షేత్రాల గురించి తెలుసా? ఒక్కసారి దర్శిస్తే సమస్త నవగ్రహ దోషాలు దూరం!
- నేటి జాతకములు..23 నవంబర్, 2025
- భగవద్గీత పుట్టిన పవిత్ర మాసం- దేవతల వరప్రసాదాల కేంద్రం- ‘మార్గశిర’ ప్రత్యేకత ఇదే!
- 2026లో లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపైనే.. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించడం ఖాయం!
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు




