కాజులూరు మండలం గొల్లపాలెంలో దొంగతనానికి వచ్చి కారుతో పాటు దొంగలు ఉడాయించారు. కుక్కకు మత్తు మందు ఇచ్చి దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి. ఇదిగో ఇది.
కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో దొంగలు వినూత్నంగా చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇంట్లో పెంపుడు కుక్క ఉందని గ్రహించి దానికి మత్తు మందు కలిపిన బిస్కెట్లు వేసి అది స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లో ప్రవేశించారు దుండగులు. ఇంటిలోని ల్యాప్‌టాప్, ఆవరణలో నిలిపిన కారుతో పాటు ఉడాయించారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఎస్సై మోహన్ కుమార్, స్థానికుల వివరాల ప్రకారం.. గొల్లపాలెం గ్రామానికి చెందిన నేతి భగవాన్ ఇంటికి మరమ్మతులు చేయించే క్రమంలో పక్క ఇంట్లో ఉంటున్నారు. అర్ధరాత్రి పన్నెండు గంటల తరవాత ఆ ఇంట్లో చోరీకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు పెంపుడు శునకాన్ని చూసి దానికి మత్తు మందు కలిపిన బిస్కెట్లు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శునకం మత్తులోకి జారుకున్న తర్వాత గేటు తాళాలు పగలగొట్టి లోనికి చొరబడి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు.
ఇంటి తాళాలు తెరిచి చూడగా విలువైన వస్తువులేవీ కనిపించలేదు. దీంతో ల్యాప్‌టాప్‌ను అందుకుని ఆవరణలోని హ్యుందాయ్ వెన్యూ కారుతో ఉడాయించారు. తెల్లవారుజామున చోరీ జరిగినట్లు గ్రహించిన భగవాన్ పోలీసులకు సమాచారం అందించడంతో క్లూస్ సీఐ పి. శ్రీనివాస్, ఎస్సై ఎం.మోహన్ కుమార్ సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరించారు. పెంపుడు శునకాన్ని పశు వైద్యులు పరీక్షించారు. ఎస్సై మోహన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- గణపతి పూజతో సమస్త గ్రహ దోష నివారణ- బుధవారం రోజు ఆచరించాల్సిన నియమాలివే!
- పూజ చేస్తామంటూ ఇంట్లోకి వచ్చిన ముగ్గురు.. చూస్తుండగానే ఏం చేశారో తెలుసా..?
- పిల్లనిచ్చి పెళ్లి చేస్తే.. ఏకంగా అత్తకే ఎసరుపెట్టిన అల్లుడు! ఏం చేశాడంటే?
- ఏం కష్టమొచ్చిందో.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి దంపతుల బలవన్మరణం.. ఐదుగురు ఆత్మహత్య!
- అయ్యో పాపం.. వాట్సాప్ స్టేటస్ పెట్టి మరీ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. కారణం తెలిస్తే..





