బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాడు.. అక్కడ ఆనందంగా గడిపాడు.. మొత్తం శుభకార్యం అయిపోయాక ఇంటికి తిరిగి వెళుతుండగా.. బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు.. పెళ్ళికని వెళ్లిన వాడు తిరిగిరాని పరలోకానికి వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి(36).. కళ్యాణదుర్గంలో తన బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళాడు. తిమ్మారెడ్డి బంధువులతో కలిసి పెళ్లి వేడుకలో పాల్గొని.. భోజనం ముగించుకున్నాడు.. అనంతరం అలా కాసేపు వాకింగ్ చేసేందుకు రోడ్డు మీదకు రాగానే.. వేగంగా వచ్చిన బైక్ ఢీకొని తిమ్మారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.
తిమ్మారెడ్డితో పాటు అలా నడుచుకుంటూ వెళుతున్న మరో ముగ్గురిని కూడా బైక్ ఢీకొట్టడంతో.. వారికి తీవ్రంగా గాయాలయ్యాయి.. తిమ్మారెడ్డికి బలమైన గాయం అవ్వడంతో అక్కడికక్కడే మరణించాడు.. దీంతో ఒక్క క్షణంలోనే పెళ్లి ఇంట్లో ఆనందానికి బదులు ఆర్తనాదాలు వినిపించాయి.. పెళ్లి మండపంలో బంధువులతో సెల్ఫోన్లో దిగిన ఫోటోలతో తిరిగి వస్తాడు అనుకున్న భర్త.. శవపేటికలో తిరిగి రావడంతో.. తిమ్మారెడ్డి భార్య భారతిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు..
పెళ్లి ఇంట్లో బంధువులతో అప్పటివరకు సంతోషంగా ఉన్న తిమ్మారెడ్డి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో భార్య పిల్లలతోపాటు.. తల్లిదండ్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది… తిమ్మారెడ్డి అకాల మృతి నేపథ్యంలో.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామంటూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు.. భరోసా ఇచ్చారు. ఈ ఘటన విచారకరమని పేర్కొన్న ఎమ్మెల్యే.. సంతాపం తెలిపారు.
Also Read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





