SGSTV NEWS online
Andhra PradeshCrime

బాబా గుడికి వచ్చి మహా భక్తుడిలా మొక్కాడు.. కానీ, పోయేటప్పుడు మాత్రం..



అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువు కట్టపై ఉన్న సాయిబాబా గుడికి ఓ దుండగుడు బ్యాగ్ తగిలించుకొని భక్తుడిలా గుడిలో ఎంటర్ అయ్యాడు. గుడికి వచ్చిన ఆ భక్తుడు దేవుడిని దర్శించుకోకుండా.. శఠగోపంపై కన్నేసాడు. సాయిబాబా చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే చేసి.. శఠగోపం దగ్గరికి వచ్చాడు.


ఎవడైనా గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకొని.. భగవంతుడి కరుణ కటాక్షాలు, ఆశీస్సులు ఉండాలని కోరుతూ పూజారి దగ్గర శఠగోపం తలపై పెట్టించుకుంటారు. కానీ వీడేంటి దేవుడికి దండం పెట్టుకుని.. వెండి శఠగోపాన్ని సర్దేశాడు. మంచిగా వచ్చి బాబా గుడికి వచ్చి.. మహాభక్తుడి మాదిరిగా మొక్కాడు.. ఆ తర్వాత.. అసలు పని కానిచ్చాడు.. ఈ శఠగోపం చోరీ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.


అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువు కట్టపై ఉన్న సాయిబాబా గుడికి ఓ దుండగుడు బ్యాగ్ తగిలించుకొని భక్తుడిలా గుడిలో ఎంటర్ అయ్యాడు. గుడికి వచ్చిన ఆ భక్తుడు దేవుడిని దర్శించుకోకుండా.. శఠగోపంపై కన్నేసాడు. సాయిబాబా చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే చేసి.. శఠగోపం దగ్గరికి వచ్చాడు. సాయిబాబాకు దండం పెట్టుకున్నట్లు నటించి.. చుట్టూ ఎవరైనా ఉన్నారా? అని గమనించాడు.. ఎవరూ లేకపోవడంతో.. శఠగోపం సర్దేశాడు..


తలపై శఠగోపం పెట్టించుకుని ఆశీస్సులు తీసుకోవాల్సిన ఆ దుండగుడు.. శఠగోపాన్ని సంచిలోకి సర్దేశాడు. శఠగోపం చోరీ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. గుడికి వచ్చిన వాడు దండం పెట్టుకుని వెళ్లకుండా శఠగోపం ఎత్తుకెళ్ళడమేంటి..? అంటూ స్థానికులు చర్చించుకుంటున్నార.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also read

Related posts