అంబేద్కర్ కోనసీమ జిల్లాలోలో ఒకే రోజు రెండు విషాద ఘటనలు వెలుగు చూశాయి. స్థానికంగా టెన్త్ క్లాస్ చదువుతున్న ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు మిస్ అవ్వగా, మరొకరు చెరువులో పడి మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. అమలాపురంలో పదవ తరగతి అమ్మాయి(14) మిస్ అయిన కొన్ని గంటల్లోనే పి.గన్నవరంలోని చెరువులో పడి ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడంతో జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి.
టెన్త్ క్లాస్ చదువుతున్న ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు మిస్ అవ్వగా మరో విద్యార్థిని చెరువులో పడి మృతి చెందిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అమలాపురానికి చెందిన 14 ఏళ్ల హషిత అనే బాలిక ఇటీవల ట్యూషన్‌కు వెళ్తానంటూ ఇంట్లో చెప్పి బయటకు వచ్చింది. అయితే ఆమె ట్యూషన్‌కు వెళ్లకుండా నడుచుకుంటూ ఎటో వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధిత కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక ఆచూకీ కనిపెట్టేందుకు గాలింప కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా పి.గన్నవరం మండలం ముంగండలో 10వ తరగతి చదువుతున్న విద్యార్ధిని కుడిపూడి కరుణ చెరువులో పడి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో మృతదేమాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ రెండు ఘటనలలోనూ ఇంట్లో వాళ్ళ మీద కోపంతోనే విద్యార్థినులు ఇలా చేసినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే చెరువులో దూకి మృతి చెందిన కరుణ అనే బాలిక ఇంట్లో వాళ్లు ఫోన్ వాడొద్దని తనను హెచ్చరించడంతో మనస్తాపానికి గురై ఇలాంటి నిర్ణయం తీసుకుందని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. అలాగే అమలాపురంలో మిస్ అయిన హషిత కూడా ఇంట్లో వాళ్ళ మీద కోపంతోనే ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
సీసీ కెమెరాల ఆధారంగా బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని.. ఫ్రెండ్స్ ఇంటికి లేదా బంధువుల ఇంటికి వెళ్లిందా లేక మరెక్కడికైన వెళ్లిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా ఇంట్లో వాళ్లు తిట్టారని బాలికలు క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు తల్లిదండ్రులకు తీరని దుక్కాన్ని మిగుల్చుతున్నాయి.
Also read
- మద్యం తాగించి.. కత్తితో బెదిరించి
- మాయమాటలు చెప్పి బాలికపై లైంగిక దాడి
- కాశీకి శివపార్వతులు..! అమలకి ఏకాదశి.. నూతన వధూవరులకు ఎందుకంత ప్రత్యేకమో తెలుసా..?
- నేటి జాతకములు..21 ఫిబ్రవరి, 2026
- చట్నీస్ రెస్టారెంట్లో భారీ పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు..!





