కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ మధ్య ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి సంఘటన ఇప్పుడు కడప జిల్లా ప్రొద్దుటూరులో కూడా జరిగింది. భర్తతో విభేదాల కారణంగా, నిత్యం ఏదో ఒక కుటుంబ కలహం జరుగుతుంది. దీంతో విసిగిపోయిన ఆ మహిళ, తనతో పాటు ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చింది.
కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఈశ్వరరెడ్డి నగర్లో ముగ్గురు పిల్లలకు కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇచ్చింది తల్లి. ఆ తరువాత తాను కూడా ఆ విషయాన్ని తీసుకుంది. ఈ పరిస్థితికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఏడాది క్రితం భార్య భువనేశ్వరుని, పిల్లలను వదిలి భర్త వెంకటకృష్ణ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నిత్యం భార్యాభర్తల మధ్య కలహాలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా భర్త వెంకటకృష్ణ వేరే మహిళతో సంబంధం పెట్టుకోవడం కూడా దీనికి కారణంగా తెలుస్తుంది.
అయితే శుక్రవారం (మార్చి 26) సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చిన ముగ్గురు పిల్లలకు భువనేశ్వరి కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇచ్చింది. అలాగే తాను కూడా తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. సాయంత్రం 6 గంటల తర్వాత భువనేశ్వరి అత్త ఇంటికి వచ్చింది. ఇంట్లో అపస్మాకరస్థితిలో పడి ఉన్న నలుగురిని చూసి కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు స్పందించారు. వెంటనే వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





