April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: కుల బహిష్కరణ కారణంగాఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ దంపతులు!

Telangana: చాలా గ్రామాల్లో గ్రామ పెద్దలు కుల బహిష్కరణ, గ్రామ బహిష్కరణలని కొనసాగిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి గ్రామ పెద్దలు ఉన్నారు.


దేశంలో ఇప్పటికీ కూడా పాత ఆచారాలు కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ప్రజలు ఇంకా మారలేదు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను ఇప్పటికీ అమలు చేస్తున్నారు. అందులో కొన్ని మంచివి ఉంటే, కొన్ని మాత్రం దారుణంగా ఉంటున్నాయి. చాలా ఊళ్ళలో మూఢ నమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి. గ్రామ పెద్దలు కఠినమైన ఆచారాలు కొనసాగిస్తున్నారు. దేశం ఇంత అభివృద్ధి చెందుతున్నా తమ ఊళ్ళకు తామే రాజులం అన్నట్లు వైఖరి చూపిస్తున్నారు. దేశంలో ప్రజలకు అనుగుణంగా చాలా చట్టాలు వచ్చాయి. అయినా కానీ చాలా గ్రామాల్లో కుల బహిష్కరణ, గ్రామ బహిష్కరణ వంటివి కొనసాగిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి గ్రామ పెద్దలు ఎక్కువగా ఉన్నారు. తాజాగా తెలంగాణలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.


ఓ దంపతులు ఆస్తి పంపకాల్లో చెప్పిన మాట వినలేదని గ్రామ పెద్దలు వారిపై గ్రామ బహిష్కరణకి పాల్పడ్డారు. తమని ఇంతలా అవమానించడంతో ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. వేరే దారి లేక చివరకి ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగా ఆత్మ హత్య ప్రయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో రామన్నపేట్ మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాధిత దంపతుల పేర్లు రమేష్, వసంత. వారిది మునిపంపుల గ్రామం. అన్న దమ్ముల ఆస్తి పంపకాల్లో చెప్పినట్లు వినలేదని ఆ దంపతులను గ్రామపెద్దలు బెదిరించారు. తరువాత గ్రామ బహిష్కరణ, కుల బహిష్కరణ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితులు పురుగుల మందు తాగారు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.

ఈ క్రమంలో దంపతుల కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ.. కుల బహిష్కరణ అవమానం వలనే తన అక్క,బావ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. న్యాయం కోసం గతంలో పోలీసులని సంప్రదించామని, అయినా కూడా న్యాయం జరగలేదని అన్నాడు. ఆగస్టు నెలలో తన అక్క, బావను బోనాలు పండగ కూడా చేసుకోనివ్వలేదని తెలిపాడు. ఆ అవమానంతోనే ఇలా సూసైడ్ కి ప్రయతించారని తెలిపాడు. తాటిచెట్ల పంపకాల్లో గ్రామ బహిష్కరణ పేరుతో అన్యాయం చేశారని బాధితుడు రమేష్ విలపించాడు. అందువల్ల చనిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Also read

Related posts

Share via