రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయిలో మద్యం మత్తులో ఉన్న అత్తామామలు కోడలిని దారుణంగా హత్య చేశారు.దోలి అనే మహిళను ఆమె అత్త తుల్శీ, మామ అనంతి చంపి పాతిపెట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటకు వచ్చింది.
Crime: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న అత్తామామలు కోడలిని దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా..మృతదేహన్ని పూడ్చి పెట్టి ఏమి తెలియనట్లు ఉండిపోయారు. అయితే భార్య కనిపించడం లేదని కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..శంషాబాద్ మండలం రామాపురం తండాకు చెందిన ముడావత్ దోలిని అదే తండాకు చెందిన ముడావత్ సురేష్ కు15 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. గత కొన్ని రోజులుగా అత్త తుల్శీ, మామ అనంతి సాతంరాయిలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. అయితే రెండు నెలల క్రితం సురేష్ దోలి భార్యాభర్తలు గ్యాస్ స్టవ్ రిపేయిర్ పనుల కోసం శంషాబాద్ వచ్చారు.
Also Read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!