April 17, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Watch Video: పేరుకే ఆ సెంటర్లు.. లోపల జరిగేదంతా అదే.. ఎక్కడంటే.. చూసేయండి…

విజయవాడలో స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక పోలీస్ బృందాలు దాడులు నిర్వహించాయి. మసాజ్‌ సెంటర్ల ముసుగులో వ్యభిచారం సాగుతోందన్న సమాచారంతోనే ఈ ఆపరేషన్‌ సాగింది. ఇసుక, మట్టి, మద్యం అక్రమ తరలింపును అరికట్టేందుకు ఏర్పడిన సెబ్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు 62 మందితో కూడిన పది బృందాలు ఏకకాలంలో విజయవాడ పరిధిలోకి వచ్చే.. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని ఆరు స్పా సెంటర్లపై ఏకకాలంలో మెరుపు దాడులు చేశాయి.



విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొంతకాలంగా స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడంతోపాటు క్రాస్ మసాజ్ ముసుగులో వ్యభిచార కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టుగా అందిన సమాచారంతో సోదాలు చేశారు. పటమట, మాచవరం, పెనమలూరు, ఎస్.ఆర్.పేట పరిధిలోని స్పా సెంటర్లపై మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. ఈ దాడులలో స్థానిక మహిళలతో పాటు విదేశీ మహిళలతో సైతం వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 10 బృందాలతో ఆరు స్పా సెంటర్లపైన జరిపిన దాడులలో థాయిలాండ్‌కు చెందిన ముగ్గురు విదేశీ మహిళలతో పాటు 24 మంది మహిళలకు విముక్తి కల్పించడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేందుకు వచ్చిన 25 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఐదుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ అక్రమ స్పా సెంటర్ల నిర్వహణను నిలువరించడంలో నిర్లక్ష్యం వహించిన అందరి పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నారు. ఈ దాడులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఐజి రవి ప్రకాష్ పర్యవేక్షణలో జరిగాయి.

వీడియో

Also read

Related posts

Share via