కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని రాఘవేంద్ర కాలనిలో మాధవ్ రెడ్డి, సరితా అనే దంపతులు జీవనం సాగిస్తున్నారు. సరితా ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తుండగా, మాధవ్ రెడ్డి ఇంట్లో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే రోజు మాదిరిగా సరితా ఉదయం స్కూల్‌కు వెళ్లగా, మాధవ్ రెడ్డి 11 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి బైక్ రిపేర్ కోసం బయటకు వెళ్ళాడు. అప్పటికే ఆ ఇంటిపై కన్నేసిన ఓ దొంగ వెంటనే ఎంతో చాకచక్యంగా ఇంటికి ఉన్న తాళం తీయకుండా కొక్కికి ఉన్న స్క్రో లను తొలగించాడు. ఇంటిలోకి ప్రవేశించి బెడ్ రూమ్‌లో ఉన్న బీరువా తాళం పగలగొట్టాడు. అందులో ఉన్న 20 తులాల బంగారు నగలు, రెండు లక్షల నగదును అపహరించాడు. ఇంటికి వచ్చిన మాధవ్ రెడ్డి ఇంటి తలుపు తెరిచి ఉండటం, లోపల అన్ని సామాన్లు చెల్లాచెదురుగా ఉండడంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించాడు. వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన స్థలానికి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రప్పించి విచారణ చేపట్టారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- తడకల మాటున చాటుమాటు యవ్వారం.. తొంగిచూసిన స్థానికుల మైండ్ బ్లాక్!
- కేసరపల్లి శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
- రాత్రి పడుకుని.. ఉదయం లేచి చూసేసరికి ఆ కాలనీలోని కార్లన్నీ ఇలానే
- ప్రియురాలిని చంపి.. భర్తకు ఫోన్ చేసిన ప్రియుడు..!





