మెదక్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన ఓ తల్లి మూడేళ్ల కన్నకూతురిని హత్య చేసింది. కూతురు గొంతు పిసికి చంపి గోతితీసి పాతిపెట్టి ప్రియుడితోపాటు వెళ్లిపోయింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Crime: మెదక్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన ఓ తల్లి రెండేళ్ల కన్న కూతురిని హత్య చేసింది. ప్రియుడితో పాటు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శబాష్‌పల్లికి చెందిన బొట్టు మమతకు 5ఏళ్ల క్రితం రాయపోల్ మండలం వడ్డేపల్లికి చెందిన భాస్కర్‌తో పెళ్లయింది. భాస్కర్, మమత దంపతులకు చరణ్, తనుశ్రీ ఇద్దరు పిల్లలున్నారు. భాస్కర్‌కు నత్తి ఉందనే కారణంతో మమత పుట్టింటికి వెళ్లిపోయింది.– పుట్టింట్లో ఉండగా మమతకు అదేగ్రామానికి చెందిన ఫయాజ్‌తో అక్రమసంబంధం ఏర్పడింది. ఈ ఏడాది మార్చిలో ప్రియుడు ఫయాజ్‌తో కలిసి మమత వెళ్లిపోయింది. అయితే –పెద్దల జోక్యంతో తిరిగి వచ్చిన మమత భాస్కర్‌తో కలిసి ఉండేందుకు ఒప్పుకుంది.
జూన్ 7న మమత మరోసారి ఫయాజ్‌తో వెళ్లిపోయింది.-కొడుకు శ్రీచరణ్‌ను పుట్టింట్లో వదిలేసి కూతురు తనూశ్రీని తీసుకుని ప్రియుడితో మమత జంపయింది. అయితే మమతతో పాటు ఆమె కుమార్తె తనుశ్రీ కూడా కనిపించక పోవడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు… పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మమత, ఫయాజ్ ఏపీలోని గుంటూరులో ఉన్నారని తెలుసుకొని, అక్కడికి వెళ్లి అదుపులో తీసుకుని విచారించారు. అయితే మమత(23) మెంట కూతురు కనిపించకపోవడంతో ఏం చేశారని పోలీసులు విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
కూతురు తనుశ్రీని తన వెంట తీసుకెళ్లిన మమత ఊరి చివర గొంతు పిసికి, గొయ్యి తీసి పాతిపెట్టినట్లు తేలింది. తనుశ్రీని తామే చంపినట్లు విచారణలో ఆ ఇద్దరూ అంగీకరించారు. కుమార్తె తను శ్రీని గొంతుపిసికి చంపి గ్రామ శివారులో పాతిపెట్టామని చెప్పారు. పాపను పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని నిందితులు చూపించగా, శుక్రవారం పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రియుడితో పాటు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Telangana: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





