Crime: పూజాకు మరింత కోపం వచ్చింది. ఆ బాలిక పారిపోబోతుంటే ఆమెను పట్టుకుంది పూజా..
ఎనిమిదేళ్ల బాలికను దారుణంగా హతమార్చింది 19 ఏళ్ల ఓ యువతి. ఈ ఘటన గుజరాత్లోని జునాగఢ్ జిల్లా, భేసన్లో చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలిక సాక్షి మోర్ తన పెద్దనాన్న కుమారుడి ఇంట్లో ఉంటోంది. సాక్షిని ఆమె సోదరుడి భార్య పూజా (19) ఓ గొలుసుతో గొంతు నులిమి చంపేసింది.
పూజాను అరెస్టు చేసిన పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. పూజాకు కొన్ని నెలల బాబు ఉన్నాడు. ఆ పసిబిడ్డ పదే పదే ఏడుస్తుండడంతో పూజా తాను ఇంటి పనులను పూర్తి చేసుకునే వరకు ఆ శిశువును చూసుకోవాలని సాక్షి మోర్ కు చెప్పింది. అందుకు ఆ బాలిక సాక్షి ఒప్పుకోలేదు.
దీంతో పూజాకు కోపం వచ్చి ఆ బాలికను కొట్టింది. దీంతో పూజా కొట్టిన విషయాన్ని ఆమె అత్తయ్యకు చెబుతానని సాక్షి చెప్పింది. దీంతో పూజాకు మరింత కోపం వచ్చింది. ఆ బాలిక పారిపోబోతుంటే ఆమెను పట్టుకుంది పూజా. సాక్షి మెడకు ఉన్న గొలుసుతోనే ఆమె గొంతును నులిమింది. సాక్షికి ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లు ఆ బాలిక మృతదేహాన్ని పూజా బెడ్రూమ్ లో ఉంచింది.
పూజా అత్తయ్య రత్న కధారె సాయంత్రం సమయంలో ఇంటికి వచ్చింది. సాక్షి గదిలో నిద్రపోతోందని భావించింది. ఆమెను లేపేందుకు ప్రయత్నించగా ఎంతకూ లేవకపోడంతో తన భర్త పృథ్వీరాజ్, కుమారుడు ఇంద్రజిత్ కి ఫోన్ చేసింది. సాక్షిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు. సహజ మరణమని పూజా నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూజానే నిందితురాలని తేల్చారు.
Also read
- హెల్మెట్ ఉన్నా దక్కని ప్రాణం.. ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!
- మైలవరంలో విషాదం.. నదిలో మునిగి అత్త, అల్లుడు మృతి
- ఇద్దరు మహిళలతో భర్త.. చూసి పూనకంతో ఊగిపోయిన భార్య.. ఆ తర్వాత..!
- బస్సులో తెరచుకున్న అత్యవసర ద్వారం.. కిందపడి బాలికకు తీవ్రగాయాలు
- భార్య, అత్తామామల దాడి.. ఆర్మీ ఉద్యోగి మృతి





