టీడీపీ భరత్ డ్రగ్స్ లో ఇరుక్కున్నారు. కాబట్టి గెలవరు. వైసీపీలో అంత దమ్మున్నోడు ఎవరూ లేరు.
Ka Paul : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమెరికా చేయగల సత్తా కేవలం నాకు మాత్రమే ఉందన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. విజయవాడలో కేఏ పాల్ మాట్లాడారు. ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రధాని మోదీ అమ్మాలని చూస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకుండా హైకోర్టు నుండి స్టే తెచ్చానని తెలిపారు. మూడేళ్ల 3 నెలల నుండి భూములన్నీ అమ్మేస్తున్నారని, స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ని ఇప్పటికే అమ్మేశారని ఆరోపణలు చేశారు.
2017లో గంగవరం పోర్ట్ 65 వేల కోట్ల షేర్స్ 600 కోట్లకు అమ్మేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా స్టేటస్ కో తీసుకొచ్చాను. రాజకీయంలో డబ్బు పంచితేనే రాజకీయ పదవి అంట. టీడీపీ భరత్ డ్రగ్స్ లో ఇరుక్కున్నారు. కాబట్టి గెలవరు. వైసీపీలో అంత దమ్మున్నోడు ఎవరూ లేరు.
ఆంధ్రాని అమెరికా చేయడల సత్తా పాల్ కి మాత్రమే ఉంది. నాకు భయపడి నా పార్టీ గుర్తు మార్చేశారు. కుండ గుర్తు ఇచ్చారు. ఏ రాజకీయ నాయకుడు దేశాన్ని బాగు చేయలేదు. కాబట్టి పొత్తు పెట్టుకోలేదు. కానీ నాతో పొత్తు పెట్టుకోవాలంటే ఎవరైనా రావచ్చు. విశాఖపట్నం ప్రజలు నన్ను కోరుకుంటున్నారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. నన్ను గెలిపించకపోతే ఆ రాజకీయ దొంగలు మీ కిడ్నీలు కూడా అమ్ముకుంటారు” అని కేఏ పాల్ అన్నారు.
Also read
- దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే శ్రీమహావిష్ణువు అనుగ్రహం.. అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం!
- నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఏ నియమాలు పాటిస్తే శుభఫలితాలు లభిస్తాయి?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- దెయ్యమై నా ఫ్యామిలీని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్ సూసైడ్ నోట్లో సంచలన విషయాలు!
- రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు.. హాస్పిటల్కు తీసుకెళ్లగా..





