గుజరాత్ అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. ప్రియుడు జై తన నెంబర్ బ్లాక్ చేశాడని రింకీ అతనిపై కారు ఎక్కించి కత్తితో పొడిచింది. జై ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. వీరికి 13ఏళ్ల క్రితం నిశ్చితార్థం జరిగి పెళ్లి క్యాన్సిల్ అయింది
Crime: ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని ప్రయుడిపై ఓ యువతి దారుణానికి పాల్పడింది. 13 ఏళ్ల క్రితం నిశ్చితార్థం జరిగి అనుకోకుండా పెళ్లి ఆగిపోయింది. దీంతో తరచు ఫోన్ లో మాట్లాడుకుంటున్న ప్రేమ జంట అనుకోకుండా కొంతకాలం దూరమైంది. చిన్న గొడవ కారణంగా అతను ఆమె నంబర్ బ్లాక్ చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ అతనిపై తన కారును ఎక్కించి, కత్తితో పొడిచిన ఘటన గుజరాత్ లో జరిగగా వివరాలు ఇలా ఉన్నాయి
నాతో ఎందుకు మాట్లాడటం లేదు..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ 13 ఏళ్ల క్రితం తనతో ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకున్న ‘జై’ అనే వ్యక్తిని ఫిబ్రవరి 25న ఉదయం కారుతో ఢీకొట్టి, కత్తితో దాడి చేసింది. ద్విచక్ర వాహనంపై ఎక్కడికో వెళ్తున్న అతన్ని వెంటాడి తన కారుతో ఢీ కొట్టింది. యువకుడిపై పగ పెంచుకున్న ఆ మహిళ దాడి చేసిన అనంతరం.. నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదు. నా నంబర్‌ను ఎందుకు బ్లాక్ చేశావు అంటూ అతనిపై అరిచింది. అతని కడుపు, నడుము భాగంలో కత్తితో మూడుసార్లు పొడిచింది. ఏదో విధంగా ఆమెనుంచి తప్పించుకుని అతను తన ప్రాణాలను కాపాడుకున్నాడు.
ఇద్దరికీ పెళ్లి అయినా..
అహ్మదాబాద్‌లోని షెలా ప్రాంత నివాసి అయిన జై.. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 13 సంవత్సరాల క్రితం రింకీతో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత కొన్ని కుటుంబ వివాదాల కారణంగా నిశ్చితార్థం రద్దయింది. తరువాత 2016 సంవత్సరంలో మరొక అమ్మాయితో వివాహం జరిగింది. మరోవైపు రింకి కూడా పెళ్లి చేసుకుంది. గత సంవత్సరం రింకి అకస్మాత్తుగా ఫోన్ చేసి మనం పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేదని చెప్పింది. ఆమె నాతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ నేను నిరాకరించాను. అయినప్పటికీ రింకీ నిరంతరం ఫోన్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో నా భార్యకు విషయం తెలిసింది. అందుకే ఆమె నంబర్‌ను బ్లాక్ చేశానని జై వివరించినట్లు పోలీసులు వెల్లడించారు. జై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలి కోసం గాలిస్తున్నారు.
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు