విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పెద్దగదిలిలో క్రికెట్ ఆటవిషాదంగా మారింది. రెండు జట్ల మధ్య జరిగిన ఘర్షణలో అజిత్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటలో తలెత్తిన చిన్నపాటి వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో కిషోర్ అనే వ్యక్తి అజిత్ను మాట్లాడుకుందామని పిలిచి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అజిత్ను స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అజిత్ మృతి చెందాడు. జరిగిన ఘటనపై అరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- పిడుగుపాటుకు ముగ్గురు మృతి
- బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం
- యువకుడి ప్రాణం తీసిన క్రికెట్
- మైనర్ బాలిక ఆత్మహత్య.. రెండవ భర్తపై ఫిర్యాదు చేసిన తల్లి





