యర్రగొండపాలెం (ప్రకాశం) : యర్రగొండపాలెం పట్టణం లోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులతో ఆదివారం వంట పనులు చేయించారు. ఆ పాఠశాలలో 600 మంది దాకా విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. కాగా ప్రతి వారం ఏదో ఒక తరగతి నుంచి ఏడు నుంచి ఎనిమిది మంది విద్యార్థులతో వంట పని చేయిస్తునట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ ఆదివారం మెనూలో చపాతి ఉండగా విద్యార్థులతో 600 చపాతీలను చేయించిన్నట్లు విద్యార్థులు తెలిపారు. తమతో వంట సిబ్బంది బలవంతంగా వంట పనులు చేయిస్తున్నారని కొందరు విద్యార్థులు చెబుతుండగా తామే ఆదివారం కావడంతో వంటవారికి సాయం చేస్తున్నామని మరికొందరు అంటున్నారు. కాగా ఇలా విద్యార్థులతో వంట పనులు చేయించడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు
Also read :
- ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
- ఈ ఉగాది ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!
- నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
- నేటి జాతకములు…17 మార్చి, 2026
- ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి





