April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

Crime News: ఛీఛీ వీడేం పోలీస్.. వెలుగులోకి ఓ గలీజ్ పోలీస్ వ్యవహరం..!


హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో కానిస్టేబుల్ ప్రదీప్‌ గలీజ్ వ్యవహరం బయటపడింది. మైనర్ బాలికను టార్గెట్ చేసుకుని.. తనతో పడుకోకపొతే ఫొటోలు మార్ఫింగ్‌ చేసి అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. బాలికతో రెండేళ్లుగా ఎఫైర్‌ పెట్టుకున్నాడు. తాజాగా, షీటీమ్ సాయంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Rajendra Nagar Police: ప్రజలకు రక్షణగా నిలబడాల్సిన ఓ పోలీసే మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఓ గలీజ్ పోలీస్ వ్యవహరం బయటపడింది. మైనర్ బాలికలే అతడి టార్గెట్. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి అమ్మాయిల ఫోన్లకు పంపి బ్లాక్‌మెయిల్ చేసేవాడు. తనతో పడుకోకపొతే ఫొటోలు అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. కానిస్టేబుల్ ప్రదీప్‌ ఫోన్ నిండా అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. మైనర్ బాలికతో రెండేళ్లుగా ప్రదీప్ ఎఫైర్‌ నడుపుతున్నాడు. గర్భం దాల్చకుండా కానిస్టేబుల్ ప్రదీప్‌ పసరు పోసేవాడు

బాలిక నగ్న వీడియోలు తీసి ఆమె ఫోన్‌కు పంపేవాడు. పిలిచినపుడు రాకపోతే వీడియోలు అప్‌లోడ్‌ చేస్తానని వార్నింగ్ ఇచ్చేవాడు. చేసేదేం లేక ఆ మైనర్ బాలిక కానిస్టేబుల్‌కు లొంగిపోయింది. బాలిక కుటుంబ సభ్యులను సైతం బెదిరించినట్లు తెలుస్తోంది. కాగా, షీటీమ్ సాయంతో బాధితులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

నిన్న సైబరాబాద్ కమిషనర్‌ను కలిసిన బాధితురాలి కుటుంబం అతడిపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ప్రదీప్‌ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ప్రదీప్ విధులు నిర్వహిస్తున్నాడు. 2020 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్.. గతంలో రాజేంద్రనగర్, కొంపల్లి, కూకట్‌పల్లి విధులు నిర్వహించాడు. అయితే,
పనిచేసిన ప్రతీచోట ఇదే తీరుగా వ్యవహరించేవాడు

Also read

Related posts

Share via