July 1, 2024
SGSTV NEWS
CrimeNational

కాల్ గార్ల్ అంటూ భార్య నెంబర్ షేర్ చేసి ఫారిన్ జంప్

‘హలో.. రేటెంత?’ అంటూ అటు వైపు నుంచి వరుసగా ఫోన్లు మోతెక్కుతుంటే ఆమెకు నోటి మాట రావడం లేదు. ఆమె సోదరులకూ ఆగంతకులు ఫోన్లు చేసి ‘అమ్మాయి.. ఉందా?” అంటూ ప్రశ్నిస్తుంటే ఆందోళనకు గురై.. చివరికి పోలీస్ ఠాణాకు పరుగులు తీసి సాయం అర్థించారు.

బెంగళూరు (యశ్వంతపుర)’హలో.. రేటెంత?’ అంటూ అటు వైపు నుంచి వరుసగా ఫోన్లు మోతెక్కుతుంటే ఆమెకు నోటి మాట రావడం లేదు. ఆమె సోదరులకూ ఆగంతకులు ఫోన్లు చేసి ‘అమ్మాయి.. ఉందా?’ అంటూ ప్రశ్నిస్తుంటే ఆందోళనకు గురై.. చివరికి పోలీస్ ఠాణాకు పరుగులు తీసి సాయం అర్థించారు. అధికారులు ఆ ఫోన్ల వ్యవహారంపై తీగలాగితే దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల సాయంతో.. సామాజిక మాధ్యమాల ద్వారా తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు భర్తపైనే ఆ భార్య బెంగళూరు నందినిలేఔట్ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు.

పోలీసులు అందించిన వివరాల్లోకి వెళితే.. ఆ భార్యాభర్తలిద్దరికీ కొన్నాళ్లుగా సరిపోవడం లేదు. భర్త నుంచి విడాకుల కోసం ఆమె న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కోపంతో భర్త ఓ కుట్ర పన్నాడు. ఫేస్బుక్ ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు పొందుపరచి, ‘కాల్ గర్ల్స్ కావాలా? ” అంటూ ప్రకటన సృష్టించి, విదేశాలకు వెళ్లిపోయాడు. దాన్ని చూసిన అనేక మంది వారికి ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఫేస్ బుక్ లో ఓ పేజ్ సృష్టించి, వారిని సతాయించినట్లు పోలీసులు వివరించారు. బాధితురాలు ఆ వ్యక్తిని 2019లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి శారీరక, మానసిక, చిత్రహింసలకు గురి చేస్తున్నాడనే వాటిని తట్టుకోలేక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే నిందితుడు సామాజిక మాధ్యమ వేదికగా కొత్త కుట్రలకు తెరలేపడంతో  పోలీసులు మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అరెస్టుకు రంగం సిద్ధం చేశారు.

Also read

Related posts

Share via