కామారెడ్డి జిల్లా బిక్నూర్ కానిస్టేబుల్ కేసులో మరిన్ని దారుణాలు బయటకొస్తున్నాయి. సొంత తమ్ముడి భార్య, పిల్లలపై సంతోష్ దాడి చేస్తుంటే స్థానికులు వీడియో తీశారు. దీంతో నడి బజారులోనే ప్యాంటు విప్పి తీసుకొండని చూపించాడు. ఇది వైరల్ అవుతోంది.
Conistable Crime: కామారెడ్డి జిల్లా బిక్నూర్ కానిస్టేబుల్ కేసులో మరిన్ని దారుణాలు బయటకొస్తున్నాయి. సొంత తమ్ముడి భార్య, పిల్లలపై దాడి చేసిన సంతోష్ గౌడ్ పరమ దుర్మార్గుడని తెలుస్తోంది. వారిని కొడుతేంటే స్థానికులు వీడియో తీశారు. దీంతో నడి బజారులోనే ప్యాంటు విప్పి తీసుకొండని చూపించాడు. ఇది వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..
ఆస్తి పంపకాల విషయంలో ఏఆర్ కానిస్టేబుల్ సంతోష్ కు అతని సోదరుడు వేణుతో తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా సంతోష్ ఈ విషయంలో వేణు ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. అయితే అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన వేణు భార్య వీడియో రికార్డింగ్ చేస్తుండగా ఆమె ఫోన్ గుంజుకుని ఈ గొడవకు అసలు కారణం నువ్వేనంటూ ఆమెపై కర్రతో దాడి చేశాడు. అప్పుడే కారులో ఇంటికి వచ్చిన వేణు తన భార్యను కొట్టడంతో ఆగ్రహించి అన్న సంతోష్ పై దాడికి దిగాడు. గల్లాలు పట్టుకుని మరి ఇద్దరూ వీధుల్లో రౌడీల్లా రెచ్చిపోయి మరీ కొట్టుకున్నారు. వేణు స్నేహితులు సంతోష్ కు ఎంతో నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ అతను వినిపించుకోలేదు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025