కృష్ణా: కామర్స్ పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్.. కామ వాంఛతో మితిమీరి ప్రవర్తించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి యువతిని లోబరచుకోవాలని ప్లాన్ చేశాడు. అతడి ప్లాన్ బెడిసికొట్టడంతో రెడ్్యండెడ్గా భార్యకు దొరికిపోయాడు. దీంతో, అందరి ముందే భర్తను భార్య చితకబాదింది. యువతిని బ్లాక్మెయిల్ చేసిందుకు పోలీసులు కామర్స్ లెక్చరర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామర్స్ లెక్చరర్ జాషువా గతంలో మచిలీపట్నంలోని ఓ మహిళా కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి ప్రస్తుతం అవనిగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో విధుల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ఓ యువతి.. కామర్స్ లెక్చరర్ జాషువాను ఆశ్రయించింది. దీంతో, ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి యువతిని లోబరచుకోవాలని జాషువా ప్లాన్ చేశాడు. యువతిని మచిలీపట్నంలోని తమ రూమ్‌కు రావాలని కోరాడు.
జాషువా వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఖంగుతిన్న యువతి.. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ను ఆశ్రయించింది. అనంతరం, జాషువా నిజస్వరూపాన్ని లెక్చరర్ భార్యకు సమాచారమిచ్చింది. దీంతో, రంగంలోకి దిగిన జాషువా భార్య.. లెక్చరర్ బాగోతాన్ని బట్ట బయలు చేసింది. ప్లాన్ ప్రకారం.. బాధితురాలితో రూమ్‌లో జాషువా ఉండగా.. అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదింది. అందరి ముందే తిక్క కుదిర్చింది. ఇక, బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు జాషువాను అదుపులోకి తీసుకున్నారు.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..





ఊడదీయడానికి అరటి తొక్క కాదు.. జగన్ కు ఎస్ఐ వార్నింగ్