SGSTV NEWS online
Andhra Pradesh

ప్రతి కుటుంబానికి భరోసా కూటమి ప్రభుత్వం – 2029లోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తాం: సీఎం చంద్రబాబు



2029లోపు వందశాతం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3డీ-కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణ పైలెట్‌ ప్రాజెక్టుకు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు.

CM Chandrababu at Burripalem : పేదలకు ఇళ్లంటే నాలుగు గోడలు కాదని భద్రత, భవిష్యత్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి కుటుంబానికి భరోసా, ప్రతి వర్గానికి అండ, ప్రతి ప్రాంతానికి అవకాశం ఇదే కూటమి ప్రభుత్వ సిద్ధాంతమన్నారు. ప్రతి పేదవాడికి ఇంటి కల సాకారం చేయాలన్నదే సంకల్పమన్న సీఎం, 2029 లోపు వందశాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని హామి ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణ పైలెట్‌ ప్రాజెక్టుకు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

ప్రతి కుటుంబానికి భరోసా కూటమి ప్రభుత్వం : అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2029లోపు వందశాతం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 12 ఏళ్లలో నాలుగు కోట్లకుపైగా పక్కా ఇళ్లు నిర్మించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీయే అని పేర్కొన్నారు. ‘‘ప్రతి కుటుంబానికి భరోసా కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధితోపాటు ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం. 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీలో ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. ఈ సాంకేతికతతో రెండేళ్ల సమయానికి బదులుగా, మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తవుతుంది.

ఇలా 117 ఇళ్ల నిర్మాణాన్ని ప్రయోగాత్మకంగా చేపడుతున్నాం. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని భ్రష్టు పట్టించింది. ఎక్కడో కొండల్లో గుట్టల్లో మంజూరు చేసింది. నివాసయోగ్యం కాని ఇళ్లను మంజూరు చేస్తే ఎవరికైనా లాభం ఉంటుందా? కరవు సీమను సిరుల సీమగా మారుస్తామని హామీ ఇచ్చాం. పేదలకు తాము ఇచ్చిన 6 లక్షల ఇళ్లను గత ప్రభుత్వం రద్దు చేశారన్న చంద్రబాబు, మళ్లీ వాటిని లబ్ధిదారులకు అందిస్తామని భరోసా ఇచ్చారు. రిలయన్స్‌ వంటి పెద్ద సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి” అని చంద్రబాబు తెలిపారు.

” ఏపీకి 75 వేల ఇళ్లు మంజూరయ్యాయి. నేను అడిగిన వెంటనే 3 లక్షల ఇళ్లకు ఆమోదం తెలిపారు. 3 లక్షలు చాలవు 9 లక్షల ఇళ్లు కావాలని కోరాను. ప్రతి పేదవాడికి ఇంటి కల సాకారం చేయాలని సంకల్పించా. నా సంకల్పానికి తోడుగా శివరాజ్‌సింగ్ చేయి కలిపారు. 9 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తాం ప్రతి పేదవాడి బాగుపడాలి. సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం. కరవు సీమను సిరుల సీమగా తయారుచేస్తామని హామీ ఇచ్చాం. రిలయన్స్‌ వంటి పెద్ద సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి. దూరదృష్టితో ఆలోచించి పట్టిసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ తీసుకొచ్చా. పట్టిసీమతో కృష్ణా డెల్టాను కాపాడింది కూటమి ప్రభుత్వమే. అభివృద్ధి చేస్తుంటే కొంతమంది అడ్డంపడ్డారు, ఎక్కడా తగ్గలేదు. వచ్చే మార్చికి పోలవరం పూర్తిచేసి ప్రధాని చేతులమీదుగా జాతికి అంకితం చేస్తాం. విజయవాడ, తెనాలి, మంగళగిరి, గుంటూరు మెగా సిటీగా తయారవుతుంది.” – నారా చంద్రబాబు, ముఖ్యమంత్రి

పెమ్మసాని పొలిటికల్‌ హీరో : ” బుర్రిపాలెం అంటే సూపర్‌స్టార్‌ కృష్ణ గుర్తొస్తారు. ఇప్పుడు అక్కడ ఇంకో హీరో వచ్చారు. ఆయనే పెమ్మసాని. కృష్ణ సినీ హీరో అయితే పెమ్మసాని పొలిటికల్‌ హీరో. అభివృద్ధి చేయడంలో పెమ్మసాని ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. నాకు కేబినెట్‌లో మొదట గుర్తొచ్చేది నాదెండ్ల మనోహర్‌. ధరలు పెరగకుండా ఆయన సమర్థంగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కోసం త్యాగం చేసిన సీనియర్‌ నేత రాజేంద్రప్రసాద్‌. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అనునిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు’’ అని చంద్రబాబు తెలిపారు.

Also read

Related posts