కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్ రైటర్‌గా పనిచేస్తున్న దాసరి స్టాలిన్ మాజీ హోంమంత్రి తానేటి వనిత తన సోదరి అని చెప్పుకుంటూ రూ.10 లక్షలు తీసుకున్నాడు. నరసరాజు అనే వ్యక్తి తన కూతుళ్లకి చెందిన ఆస్తిని రిజిష్ట్రేషన్ చేస్తానని డబ్బులు దోచుకున్నాడు.
మాజీ హోంమంత్రి తానేటి వనిత తన సోదరి అని చెప్పుకుంటూ డబ్బులు తీసుకున్న ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాసరి స్టాలిన్ స్టాంప్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. ఏలూరుకి చెందిన నరసరాజు తన కూతుళ్లకు చెందిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాడు.
సోదరుడని చెప్పి..
మాజీ హోంమంత్రి తానేటి వనిత సోదరుడు అని చెప్పి, ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని స్టాలిన్ రూ.పది లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత నరసరాజు అడిగితే చంపేస్తానని బెదిరించాడు. ఆ డబ్బు రిటర్న్ ఇవ్వనని, ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించనని, ఎవరితో అయిన చెబితే చంపేస్తానన్నాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకి వచ్చింది.
స్థానిక అధికారులు బాధితుల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. మాజీ మంత్రి సోదరుడు అని చెప్పుకుని డబ్బులు తీసుకున్న స్టాలిన్‌ను శిక్షించి తప్పకుండా నరసరాజు సమస్యను పరిష్కరిస్తామని స్థానిక అధికారులు హామీ ఇచ్చారు. దుర్మార్గానికి పాల్పడుతన్న వారిని తప్పకుండా శిక్షిస్తామన్నారు. ఇలా ఎవరైనా లంచం తీసుకుంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయమని పోలీసులు తెలిపారు.
ప్రతీ కార్యాలయంలో ఇలా అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని, వారిని గుర్తించి ఎలాగైన చర్యలు తీసుకుంటామని సచివాలయ అధికారులు తెలిపారు. కొందరు ఇలానే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా డబ్బులు తీసుకుంటున్నారని మరికొందరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావాలనే అధికారులు భూ రికార్డుల్లో పేర్లు మార్చి మోసం చేస్తున్నారని, మళ్లీ తమ దగ్గర డబ్బులు దోచుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం