దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్‌నగర్ అలకనందా ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రాకెట్ కీలక సూత్రదారిగా భావిస్తున్న పవన్ ఎలియాస్ లియోన్ తెలంగాణ సీఐడీ పోలీసులకు చిక్కాడు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్‌నగర్ అలకనందా ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రాకెట్ కీలక సూత్రదారిగా భావిస్తున్న పవన్ ఎలియాస్ లియోన్ తెలంగాణ సీఐడీ పోలీసులకు చిక్కాడు. గత జనవరిలో వెలుగు చూసిన ఈ ఘటనలో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు అలకనందా ఆసుపత్రి యజమాని సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ఆసుపత్రిని డీహెచ్‌ఎంవో సీజ్ చేశారు. అప్పటి నుంచి నిందితులకోసం వెతుకుతున్న పోలీసులకు ఎల్‌బీనగర్ ప్రాంతంలో పవన్ చిక్కాడు.
Alakananda Kidney Racket
అలకనందతో పాటు పలు ఆసుపత్రులలో అక్రమంగా కిడ్నీ మార్పిళ్లకు పాల్పడిన ముఠాకు పవన్‌ను సూత్రధారిగా ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. ఈకేసులో ఇప్పటికే పదిమందికిపైగా వైద్యులు, ఆసుపత్రుల నిర్వాహకులు, దళారులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పవన్ శ్రీలంకకు, మరికొందరు ఇతర ప్రాంతాలకు పారిపోయాడు. వపన్ గతంలోనూ శ్రీలంక, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైల్లో అతడు కిడ్నీరాకెట్ నిర్వహించినట్లు సీఐడీ పోలీసులు నిర్ధారించారు. కాగా రాచకొండ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. పవన్ ఓవైపు శ్రీలంకలో కేసినో నిర్వహిస్తూనే భారత్‌లో కిడ్నీ దందా సాగించినట్లు వెల్లడైంది. గతంలోనే సీఐడీ అతడి కారును స్వాధీనం చేసుకుంది. అతడి కుటుంబసభ్యులపై నిఘా ఉంచింది. ఈక్రమంలోనే అతడు తిరిగి ఇండియా వచ్చినట్లు ఎల్‌బీనగర్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో గాలించి పట్టుకొంది.
కాగా, సీఐడీ పోలీసుల ఎంక్వయిరీలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పవన్ గతంలో కిడ్నీరాకెట్ వలకు చిక్కి తానే స్వయంగా కిడ్నీ అమ్ముకునే పరిస్థితి వచ్చినట్లు తెలిసింది. ఈదందాలో దళారులకే ఎక్కువగా లాభం వస్తుందని గ్రహించి తానే కిడ్నీ రాకెట్ రంగంలోకి దిగాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారిని గుర్తించేందుకు ఏజెంట్లను నియమించుకుని కిడ్నీ గ్రహీతల సమాచారాన్ని సేకరించేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న ఆసుపత్రుల యజమానులను గుర్తించి వారికి లాభం వచ్చే మార్గాలను తెలిపేవాడు. అలా ఈ దందాలో సొంతంగా ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కో కిడ్నీమార్పిడికి గ్రహీతల నుంచి రూ.50లక్షల నుంచి రూ.60లక్షలను వసూలు చేసి డాక్టర్లకు కొంత, దాతలకు రూ.5లక్షలు, దళారులకు కొంత ఇచ్చేవాడు.
అలా రూ.15లక్షల వరకు ముట్టజెప్పేవాడు. అలా ఒక్కో ఆపరేషన్‌కు ఎంతలేదన్న రూ.30లక్షల వరకు మిగులుతాయి. అలా చాలాకాలంగా ఈ వ్యవహారంలో పవన్ నేరాలు చేస్తూనే ఉన్నాడు. ఒక చోట కేసు నమోదైతే మరో చోటకు మకాం మార్చేవాడు. అలా గతంలో వైజాగ్‌లో ఒక కేసులో పవన్‌ను పోలీసులు నిందితుడిగా గుర్తించారు. అయితే పోలీసులకు అతడి ఆనవాళ్లు తెలియకపోడంతో పవన్ పేరుతో ఉన్న మరో వ్యక్తిని తన స్థానంలో పంపాడు. అతడే సూత్రధారి పవన్ అనుకొని వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కానీ, అసలు పవన్ మాత్రం తన దందా యధేచ్ఛగా కొనసాగిస్తూ వస్తున్నాడు. కానీ, చివరికి సీఐడీ పోలీసులకు చిక్కక తప్పలేదు.
Also read
- Andhra: అచ్చం గీతాగోవిందం మూవీ లాంటి సీన్ – ఈ విద్యార్థిని గురువుకు ఎలా పంగనామాలు పెట్టిందంటే
- Love Couple Suicide : ఖమ్మంలో ప్రేమజంట ఆత్మహత్య.. ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రేయసి…చెట్టుకు ఉరేసుకుని ప్రియుడు..
- Crime News : నెల్లూరు జిల్లా రాపూరు స్టేట్ బ్యాంక్ ఖాతాలలో నగదు మాయం
- AP Crime: పల్నాడులో రియల్ ఎస్టేట్ మర్డర్.. తండ్రీకొడుకులను నరికి నరికి!
- AP Crime : భార్యను కాపురానికి పంపలేదని అత్తను ఏసేసిన అల్లుడు