డబ్బు తీసుకుని.. దారుణానికి సహకరించిన వైనం
నరసరావుపేట: మాచర్ల పరువు హత్య ఘటనలో ఓ పోలీసు అధికారి సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమపెళ్లి చేసుకుందని చౌడేశ్వరి(23)ని ఆమె తండ్రే హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుల విచారణలో… ఆమె ఆచూకీ కనిపెట్టి, తండ్రికి అప్పగించింది ఓ పోలీసు అధికారేనని తేలింది. కుమార్తె ఆచూకీ కనిపెట్టి అప్పగిస్తే సదరు పోలీసుకు భారీ మొత్తం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు.. రెండు విడతలుగా నగదు ఇచ్చినట్లు ప్రధాన నిందితుడు అంగీకరించాడని సమాచారం.
ఎలా చేశారంటే..
ప్రేమపెళ్లి చేసుకున్న నాగరాజు, చౌడేశ్వరి జంట నరసరావుపేట మండలం పెదతురకపాలేనికి చెందిన ఖాజా సాయంతో నరసరావుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఖాజాను నరసరావుపేట రూరల్ పోలీసులు పట్టుకుని విచారించగా కొత్తజంట ఆచూకీ చెప్పాడు. మాచర్ల పోలీసులు వారిద్దరినీ తీసుకెళ్లారు. తాను మేజర్న్న, నాగరాజుతోనే ఉంటానని చౌడేశ్వరి చెప్పినా.. ఆ అధికారి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. ఆమెను చంపినరోజు ఆ అధికారి సెలవులో ఉన్నారు. పోస్టుమార్టం రిపోర్టును తారుమారు చేయాలనుకున్నా ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో హత్యోదంతం బయటపడింది.
Also read
- (no title)
- భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అన్నీ పునరుద్ధరించాలి….. ఈమని గ్రీష్మ కుమార్, జిల్లా అధ్యక్షుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం.
- చౌడేశ్వరిని అప్పగించింది పోలీసు అధికారే!
- ఆ పసిపాపల నవ్వులు ఒక్కసారిగా మాయం.. చీకటిగా మారిన ఓ తల్లి జీవితం..!
- Hyderabad: పారడైజ్ దగ్గరకు ఆటోలో ఒంటరిగా వచ్చిన నైజీరియన్ మహిళ.. అనుమానంతో చెక్ చేయగా..





